కలక్టరేట్ – కలక్టర్ వారి కార్యాలయము
జిల్లా పరిపాలనలో కలక్టర్ కార్యాలయము ప్రధాన భూమికను నిర్వహిస్తుంది. జిల్లాకు అధిపతిగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు కేడర్ కల్గిన కలెక్టర్ ఉంటారు. ఈయన జిల్లా మేజిస్ట్రేట్ గా ఉంటూ తన పరిధిలో ‘ లా మరియు ఆర్డర్’ సక్రమంగా అమలు అయ్యేటట్లు చూచుట ప్రధాన బాధ్యత. ఈయన ప్రధానంగా ప్రణాళిక మరియు అభివృద్ధి, లా మరియు ఆర్డర్ , నిషిద్ధిత ప్రాంతము / ఏజెన్సి ప్రాంతాలు, సాధారణ ఎన్నికలు, ఆయుధాల లైసెన్సులు మొదలగునవి పర్యవేక్షించుదురు.
ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు కేడర్ కల్గిన సంయుక్త కలెక్టర్, జిల్లాలో వివిధ విభాగాల క్రిందనున్న రెవిన్యూ పరిపాలనను పర్యవేక్షించేదరు. ఈయన అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గా వ్యవహరిస్తారు. సంయుక్త కలెక్టర్ ప్రధానముగా పౌర సంబందాల శాఖ, భూవిషయములు, గనులు మరియు ఖనిజములు, గ్రామీణఅధికారులు మొదలగునవి పర్యవేక్షిస్తారు .
ఐ.ఎ.ఎస్ అర్హత లేని స్పెషల్ డెప్యూటీ కలక్టర్ హోదాలో సంయుక్త కలక్టర్-2 వారు జిల్లాలో వివిధ శాఖలలో జరుగుచున్న అభివృద్ధి కార్యక్రమములను పర్యవేక్షిస్తారు. ప్రధానముగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, వెనుకబడిన తరగతుల సంక్షేమము, వెనుకబడిన తరగతుల కార్పోరేషన్, ప్రత్యెక ప్రతిభావంతుల సంక్షేమము, పాఠశాల విద్య, గృహ నిర్మాణము మరియు ఇతర శాఖలను పర్యవేక్షిస్తారు. స్పెషల్ డెప్యూటీ కలక్టర్ హోదా కల్గిన జిల్లా రెవిన్యూ అధికారి, కలక్టర్ మరియు సంయుక్త కలక్టర్ వారి విధి నిర్వహణలో సహాయ అధికారిగా ఉంటారు. జిల్లా రెవిన్యూ అధికారి కలక్టర్ మరియు సంయుక్త కలక్టర్ వారి విధి నిర్వహణలో సహాయకారిగా ఉంటారు. జిల్లా రెవిన్యూ అధికారి కలక్టర్ కార్యాలయమునకు సంబంధించిన అన్ని విభాగాలను పర్యవేక్షిస్తారు. ఈయనప్రధానంగా సాధారణ పరిపాలన మరియు రోజువారీ కలక్టర్ కార్యాలయ పనులను పర్యవేక్షిస్తారు.
తహసిల్దారు హోదా కల్గిన అడ్మినిస్ట్రేటివ్ అధికారి (పరిపాలనాధికారి) కలెక్టర్ గారికి ప్రధాన సహాయకుడిగా ఉంటారు. ఈయన ప్రధానముగా కలక్టర్ కార్యాలయమునకు సంబంధించిన అన్ని శాఖల పర్యవేక్షణ మరియు చాల వరకు అన్ని దస్త్రములు ఈయన ద్వారానే (కలక్టర్ / సంయుక్త కలక్టర్) సంబంధిత అధికారికి పంపబడును.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్కరణల మేరకు సౌలభ్యము కొరకు కలక్టర్ కార్యాలయమునకు విభాగములుగా విభజించిరి.
- సెక్షన్ – ఎ : ఎస్టాబ్లిష్ మెంట్, మరియు కార్యాలయ పద్ధతులు
- సెక్షన్ – బి : అకౌంట్స్ మరియు ఆడిట్
- సెక్షన్ – సి : (కోర్టు / లీగల్) కు సంబందించిన మేజిస్టిరియల్ విషయములు
- సెక్షన్ – డి : భూ రెవిన్యూ మరియు రిలీఫ్ (సౌలభ్యము)
- సెక్షన్ – ఇ : భూపరిపాలన
- సెక్షన్ – ఎఫ్ : భూ సంస్కరణలు
- సెక్షన్ – జి : భూ సమీకరణ
- సెక్షన్ – హెచ్ : ప్రోటోకాల్, ఎన్నికలు మరియు ఇతర పనులు