ముగించు

జిల్లా నీటి యాజమాన్య సంస్థ

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కల్పనా సంస్థ కార్యక్రమం విశాఖపట్నం జిల్లాలో 2008, ఏప్రియల్ 1 వ తేదిన 3 వ విడతలో భాగంగా ప్రారంభించబడినది. ఈ కార్యక్రమము 2017–18 వరకు చాల ఉప యుక్తంగా నిర్వహించబడినది మరియు ఇంకనూ ఈ సంస్థ కార్యక్రమములు జిల్లాలో కొనసాగింపబడుచున్నవి.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కల్పనా సంస్థ కార్యక్రమములో భాగంగా లోగడ సామాజిక పరమైన అంశాలు అనగా చిన్న తరహా వ్యవసాయ చెరువులు, పొలములు, చిన్న చిన్న కాలువలు మరియు భూసార పెంపుదల కార్యక్రమములు చేపట్టి విస్తారమైన పూర్వ స్థితికి తెచ్చుట జరిగినది. పైన పేర్కొన్న అంశాలే కాకుండా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కల్పనా సంస్థ నవీకరణ సూచనలు మేర,  అనేక అను సంధాన కార్యక్రమములు చేపట్టి కొనసాగించుట జరుగుచున్నది. గిరిజన ప్రాంత మండలాలలో భూ అభివృద్ధి, నీటి సంరక్షణ, అడవుల పెంపకం, మొక్కలు నాటుట మరియు ఎస్.ఎం.సి.పనులకు అచట ప్రజల జీవనోపాధి మరియు నిర్దేశిత ఉపాధి కల్పనలను దృష్టిలో ఉంచుకొని మరియు దీర్ఘకాల వనరులు మరియు ఆస్తుల పెంపుదల దృష్ట్యా చాలా ప్రాముఖ్యత ఇచ్చుట జరిగినది.

జిల్లాలో 39,243  (ఎం.ఎం.ఎస్ గ్రూపులు) శ్రమ శక్తి సంఘాలు ఏర్పడినవి. ఒక్కొక్క గ్రూపులో 10 నుండి 30 వరకు సభ్యులలో 6.52 లక్షల వేతన కార్మికులు నమోదు కాబదిరి. వీటిలో 30,149 శ్రమశక్తి సంఘాలు మరియు 3.21 లక్షల కుటుంబాలకు 2016–17  సం.లో పని కల్పించుట మరియు 5.69 లక్షల వేతన కార్మికులకు పని కల్పించుట జరిగినది.

స్కీములు / ప్రాజెక్ట్ వివరములు

కేంద్రీయ పనులు

  1. చేపల / రొయ్యల చెరువులు
  2. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణము
  3. వర్మీ / ఎం.ఎ.డి.ఇ.పి ఎరువుల కూర్పు / ప్రత్యెక రకమైన ఎరువు
  4. తోటల పెంపకం
  5. ఇరు పార్శ్వముల చెట్లు గల – అందమైన బాట
  6. చిన్న గుట్టలపై మొక్కలు / చెట్ల పెంపకం
  7. నీటి సంరక్షణ నిర్మాణాలు
  8. నెలలో తేమ / తడి సంరక్షణ పనులు

సంప్రదించవలసిన వివరాలు

శ్రీ ఎ.కళ్యాణ చక్రవర్తి

ప్రాజెక్ట్ డైరక్టర్

జిల్లా నీటి యాజమాన్య సంస్థ ( డి.డబ్ల్యు ఎం.ఎ )

విశాఖపట్నం , అంధ్రప్రదేశ్

ఫోన్ : కార్యాలయము : 0 8 9 1 – 2 7 1 3 1 0 ( 0 )

మొబైల్         : 7 7 0 2 0 7 6 9 6 9

ఇ-మెయిల్ అడ్రసు : dwmavsp@yahoo.co.in

 

శ్రీ ఎం.ఆనందరావు

అడిషనల్ ప్రాజెక్ట్ డైరక్టర్

(ఎం.జి.ఎన్.అర్ ఇ.డి.ఎ ) డి.డబ్ల్యు ఎం.ఎ

విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్

కార్యాలయఫోన్ నెం : 0891-2712310

మొబైల్               : 9000159992

ఇ-మెయిల్ అడ్రసు :anandanand4@yahoo.com

వర్గీకరణ / సంస్థ నిర్వహణ

జిల్లా కలెక్టర్ (జిల్లా ప్రోగ్రాం కొ ఆర్డినేటర్ , ఎం.జి.ఎం.ఆర్.ఇ.జి.ఎస్ )

ప్రాజెక్ట్ డైరక్టర్ (అదనపు జిల్లా ప్రోగ్రాం కొ ఆర్డినేటర్ ,ఎం.జి.ఎం.ఆర్.ఇ.జి.ఎస్)

నిర్వహణాధికారి, జిల్లా ప్రజా పరిషత్ ప్రాజెక్ట్ డైరక్టర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ వారు కూడా అదనపు జిల్లా ప్రోగ్రాం కొ-ఆర్డినేటర్లు గా వ్యవహరిస్తారు.

వ్యవస్థ పట్టిక

  1. అదనపు ప్రాజెక్ట్ డైరక్టర్ – 1
  2. సహాయ ప్రాజెక్ట్ డైరక్టర్ – 1
  3. మండల పరిషత్ అభివృద్ధి అధికారి / ప్రాగ్రాం అధికారి
  4. అదనపు ప్రోగ్రాం ఆఫీసర్ / మండల స్థాయి – ఎఫ్.టి.ఇ
  5. సాంకేతిక కన్సల్టెంట్ ( ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ) మండల స్థాయి – ఎఫ్. టి.ఇ
  6. సహాయ సాంకేతిక నిపుణుడు (క్లస్టర్ స్థాయి ) – ఎఫ్. టి.ఇ
  7. కంప్యుటర్ ఆపరేటర్ ( మండల స్థాయి )
  8. ఫీల్డ్ అసిస్టెంట్ ( గ్రామ పంచాయితీ స్థాయి – కాంట్రాక్ట్ )
  9. సీనియర్ మేట (గ్రామ పంచాయితీ స్థాయి – కాంట్రాక్ట్ )

సంబంధిత వెబ్ సైట్లు :

  1. http://www.nrega.ap.gov.in
  2. http://www.ntrjalasiri.ap.gov.in
  3. http://qualitycontrol.ap.gov.in
  4. http:// www.socialaudit.ap.gov.in
  5. http:// iwmp.ap.gov.in