ముగించు

గనులు మరియు భూగర్బ శాఖ

పార్శ్య వివరణ

శాఖ యెక్క పాత్ర మరియు కార్యదరణ

 విశాఖ జిల్లాలో గనులు మరియు భూగర్బ శాఖలో ఉపా సంచాలకులు, గనులు మరియు భూగర్బ శాఖ,  విశాఖపట్నం వారి పరిధిలో రెండు కార్యాలయములు గలవు. అవి

  1. సహాయ సంచాలకులు, గనులు మరియు భూగర్బ శాఖ, విశాఖపట్నం.
  2. సహాయ సంచాలకులు, గనులు మరియు భూగర్బ శాఖ, అనకాపల్లి.

సహాయ సంచాలకులు, విశాఖపట్నం కార్యాలయ పరిధిలో మొత్తం (22) మండలములు గలవు.

(ఆనందపురం, అనంతగిరి, అరకువాలీ, అచ్చుతాపురం, భీమునిపట్నం, చిన్నగదిలి, చోడవరం, చీడికాడ, దేవరపల్లి, డుంబ్రిగుడ, గాజువాక, హుకుంపేట, కే.కోటపాడు, పద్మనాభం, పెందుర్తి, పరవాడ, పెదగంట్యాడ, పాడేరు, రాంబిల్లి, సబ్బవరం, మాడుగుల, విశాఖపట్నం రురల్ & అర్బన్).  సదరు మండలములోని చిన్న తరహ ఖనిజముల త్రవ్వకములు క్రమబద్దికరించ ఆయా ఖనిజ ప్రాంతములను కౌలుకి ఇచ్చి వాటిపై రాయల్టీ మరియు సినరేజి రుసుము వసూలు చేయుట, ఖనిజముల అక్రమ త్రవ్వకములు మరియు అక్రమ రవాణా జరగకుండా నిరోధించుట ఈ కార్యాలయపు ప్రధాన విధులు. చిన్న తరహ ఖనిజ దరఖాస్తులను మీ-సేవ ద్వారా స్వీకరించి, పరిశీలన తదుపరి ప్రతిపాదనలను సంబందిత అధికారులకు దరఖాస్తులపై తదుపరి ఉత్తర్వుల కొరకు సమర్పించుట జరుగుతుంది.

  • సవరించబడిన మైన్స్ అండ్ మినరల్స్(రెగ్యులేషన్ & డెవలప్మెంట్) చట్టం-2015 ప్రకారం పెద్ద తరహ ఖనిజము వేలం వేయబడును కాబట్టి. కొత్తగా పెద్ద తరహ లీజు లు మంజూరు కాబడవు కలర్ గ్రానైట్ లీజులు సంచాలకులు వారు మంజూరు చేయుదురు. చిన్న తరహ ఖనిజములకు రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ మరియు గ్రావెల్ మొదలైన వాటికి సంబంధించి రెవిన్యూ డిపార్ట్మెంట్ వారిచే నిరభ్యంతర దృవీకరణ పత్రం పొందిన పిదప క్వారీ లీజు మంజూరు కొరకు ఉప సంచాలకులు, గనులు మరియు భూగర్బ శాఖ, విశాఖపట్నం వారు మంజూరు చేయుదురు. ఈ  కార్యాలయమునకు సంబంధించి అమలు పరచవలసిన ప్రణాళిక మరియు ప్రణాళికేతర అబివృద్ధి పధకం ఏమియు లేవు.
  • సహాయ సంచాలకులు, గనులు మరియు భూగర్బ శాఖ,  విశాఖపట్నం వారి పరిధిలో లభించు ఖనిజములు :
  • చిన్న తరహ ఖనిజపు లీజులు సంఖ్య : 169 ఈ కార్యాలయపు పరిధి లో కలర్ గ్రానైట్, రోడ్ మెటల్, బిల్డింగ్ స్టోన్ మరియు గ్రావెల్, లేటరైట్, మైకా, క్వార్ట్జ్, కాల్సైట్ వంటి చిన్న తరహ ఖనిజములు లభ్యమవుతున్నాయి.
  1. కలర్ గ్రానైట్ లీజులు సంఖ్య : 42,  రోడ్ మెటల్ , బిల్డింగ్ స్టోన్ మరియు గ్రావెల్ సంఖ్య : 109,
  2. చిన్న తరహ ఖనిజములు గా ఈ మధ్య వర్గికరించబడిన ఖనిజములు సంఖ్య : 18

పథకాలు / చర్యలు/ ప్రణాళిక చర్యలు

ఈ విభాగం ప్రజలకు ఏ పథకాన్ని అమలు చేయదు అని ఇది సమర్పించబడుతున్నది

ఈ విభాగం ఆదాయ ఉత్పత్తి  శాఖ మాత్రమే .      ఈ  కార్యాలంనకు 2019-2020 సo11 నకు 75.00 కోట్లు నిర్దేశచింతిరి.

టార్గెట్ మరియు అచివ్మెంట్ ఆప్ 15 ఆగష్టు 2019  ఈ క్రింది విధంగా వున్నది.

వరుస సంఖ్య కేటగిరి నిర్దేశం

(కోట్లాలలో)

వసూలు  (కోట్లాలలో) సాధించిన  శాతం
1 పెద్ద తరహా 0.00 0.00 0.00
2 చిన్న తరహా 21.02 12.78 60.79
  మొత్తం 21.02 12.78 60.79