ముగించు

సర్వే & భూ రికార్డులు

సర్వే మరియు భూ సంస్కరణలు :

మీ సేవ మరియు మీకోసం లో ఎఫ్ లైన్స్ మరియు సబ్ డివిజన్ వారిగా పట్టాలు

ఎఫ్ లైన్స్ : 99.9%  గడువులోపు అర్జీలు పరిష్కారమైనవి

పట్టా ఉప డివిజన్ ( సబ్ డివిజన్ వారిగా పట్టాలు ) 97.95%

మీకోసం : 99.02% పరిష్కారమైనవి.

గుర్తింపు కలిగిన / పొందిన సర్వేయర్లు:

గుర్తింపు కలిగిన / పొందిన సర్వేయర్లు మొత్తం                         :       263

మండలాలలో పని చేయుచున్న గుర్తింపు పొందిన సర్వేయర్లు          :       162

అటో కాడ్ / ఇ టి ఎస్ లో తర్పిదు పొందిన గుర్తింపు కల్గిన సర్వేయర్లు        :       66

పట్టణ సర్వే కరదీపిక:

ఉద్దేశ్యం / ప్రాముఖ్యత  :

విశాఖపట్నం జిల్లాలో గల పట్టణ ప్రాంతమునకు సంబంధించిన సర్వే వివరాలు అనగా నిర్మాణాలు ఎక్కువగా జరిగిన ప్రాంతము , నాలాలో మార్పు చేసినవి, లే అవుట్లకు ఉద్దేశించినవి  (ముఖ్యంగా వ్యవసాయం ఆధారిత కాని ప్రాంతాలు ఆమోదము పొందిన లే-అవుట్లు  ప్రామాణికముగా మాత్రమె

సాప్ట్ వేర్ : మీ సేవ డెవలపర్స్ అభివృద్ధి చేసినవి (రామ్ ఇన్పో లిమిటెడ్)

దరఖాస్తులు / అర్జీలు:

భూ పట్టాలకు సంబంధించిన పిర్యాదుదారుడు ఆన్ లైన్ ద్వారా చ.గ. 5 రూ చొప్పున సేవ రుసుముతో కలిపి భూమికి సంబంధించిన పత్రాలు ( భూ దస్తావేజులు) జత చేసి పిర్యాదు చేయాలి. పిర్యాదు దారునకు సంబంధిత సర్వే సంస్థ వారి నుండి ఎస్.ఎం.ఎస్ ద్వారా సమాచారము తెలియజేయుదురు. సంస్థ చేసిన పనిని సంబంధిత శాఖ వారు  తనిఖి చేయుదురు. చివర అంక నివేదిక సంబంధిత తహసిల్దారు విడుదల చేయుదురు. దానిని మీ సేవా కేంద్రము నుండి పొందవచ్చును.

విశాఖపట్నం జిల్లాలో గల 10 మండలాలు దిగువ చూపబడిన ప్రయివేట్ సంస్థలకు బదలాయించుట జరిగినది.

ఎకులార్క్స్ :

  1. విశాఖపట్నం గ్రామీణం
  2. భీమునిపట్నం
  3. ఆనందపురం
  4. పద్మనాభం
  5. పరవాడ మండలం

జియోకాన్ సర్వే :

  1. గాజువాక
  2. పెందుర్తి
  3. విశాఖపట్నం (పట్టణ ప్రాంతం)
  4. పెదగంట్యాడ
  5. సబ్బవరం

సర్వే చేయబడని గ్రామాలు:

ప్రభుత్వ సర్వేయర్లు మరియు గుర్తింపు పొందిన సర్వేయర్లసు ప్రాథమిక సర్వే చేయబడిన గ్రామం కే.బి.అగ్రహారం, కోట ఉరట్ల మండలం మొట్టమొదటిది. ప్రాథమిక సర్వే 04.09.2017 న ప్రారంభించి ఇంకా కొనసాగుతుంది. క్షేత్రపని రాళ్ళు పాటుత, రికార్డు నమోదు పూర్తికాబడినవి. సంబంధిత దస్త్రాలు తహసిల్దారు వారికి రెవిన్యూ విచారణ కొరకు పంపడమైనది.

 

స్కీములు ప్రాజెక్టుల వివరులు :

ఫీల్డ్ మేజర్ మెంట్ పుస్తకము డిజిటలైజేషన్ :

ఎ.పి.ఎస్.ఎ.సి, ప్రణాలిక విభాగము, ఆంధ్రప్రదేశ్ వారు జాతీయ భూ రికార్డుల నవీకరణ కార్యక్రమములో భాగము, ఆంధ్రప్రదేశ్ నందలి విశాఖపట్నం జిల్లాలో ఫీల్డ్ మేజర్ మెంట్ పుస్తకముల డిజిటలైజేషన్ చేయు కార్యక్రమము చేపట్టుట జరిగినది.

డిజిటలైజేషన్ పూర్తీ కాబడినవి :       85%

2,45,617 ఫీల్డ్ మేజర్ మెంట్ పుస్తకములలో 1,54,814 ఎప్.ఎం.బి లు సర్వేయర్లసు డిజిటల్ సంతకాలు కాబడినవి.

సంప్రదింపులకు వివరాలు      :

శ్రీమతి మనీషా త్రిపాఠి , ఎం.టెక్

సహాయ సంచాలకులు

జిల్లా సర్వే మరియు భూరికార్డులు, విశాఖపట్నం

కార్యాలయం ఫోన్ నెంబరు : 0891–2560233

సంబంధిత వెబ్ సైట్ ల వివరాలు :

  1. http://ap.meeseva.gov.in
  2. http://meekosam.ap.gov.in
  3. http://meebhoomi.ap.gov.in
  4. http://bhuraksha.ap.gov.in:8080/e-Secure/index.html
  5. http://aplandsurvey.org