ముగించు

ఆసక్తి ఉన్న స్థలాలు

సింహాచలం :

విశాఖపట్నం జిల్లాలో సింహాచలం ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. సింహాచలం కొండలలో విశాఖపట్నం నాకు 16 కి.మీ దూరములో కేంద్రికృతమై ఉన్నది. సింహాచలం నాకు రోడ్డు మరియు రైలు సౌకర్యములు కలవు. సింహాచలం క్షేత్రంలో కోలువైయున్న విష్ణువు యొక్క ప్రతిరూపం నృసింహస్వామీ చాలా ప్రసిద్ధి చెందినది. భాగ్యవంతమైనది. మరియు అత్యంత శిల్ప కళా నైపుణ్యం కలది. సింహాచలం అనగా సింహపు పర్వతము అని అర్ధము.

వరాహ లక్ష్మీనరసింహస్వామీ వారి దేవాలయము కొండమీద సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున కొలువై యున్నది. దేవాలయమునకు వెళ్ళు మార్గములో అనాస తోటలు, మామిడి, పనస మరియు ఇతర ఫల వృక్షాలతో నిండి యుండి పచ్చదనాన్ని కలిగియుంటుంది. వాస్తురీత్యా ఈ దేవాలయము గొప్పగా కీర్తింపబడుచున్నది. చతురస్రపు ప్రాకారములో పెద్ద స్థంభం ఒక వరండా ముందు ఒక చిన్న ధ్వజ స్థంభం కలిగి ఇవన్ని నల్ల రాతితో తయారు చేయబడినవి. ఇవన్ని కూడా సాంప్రదాయ నగలు మరియు పూల దండలతో అలంకరింపబడి చాల గొప్పగా ఉన్నట్లు మనకు వైష్ణావతి పురాణం ప్రకారము తేటతెల్లం అగుచున్నది. ఇందులో గల ఒక స్థంబం కప్ప స్థంభం గా పిలవబడుచు దీనికి అపారమైన అతీంద్రియ శక్తులు కలవని ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ రధమునకు రాతితో చెక్కబడిన రాతిచక్రము మరియు అశ్వములు కలవు.

ఇక్కడ భగవంతుని స్వరూపం చిన్నదిగా ఉండి ఎల్లప్పుడూ గంధపు పూతతో కప్పబడి ఉంటుంది. ప్రతి సంవత్సరము ‘మే’ మాసములో గంధపు పూతను ఒక పెద్ద ఉత్సవాముగా నిర్వహించి తొలగిస్తారు. ఈ ఉత్సవాన్ని చందన యాత్రగా పిలవబడుచూ భారత దేశంలో వేలకొలది ప్రజలని ఆకర్షిస్తూ ముఖ్యముగా ఒరిస్సా తదితర ప్రాంతాల నుండి ప్రజలు తరలి వస్తారు. ఈ దేవాలయమునకు ఉత్తర దిక్కుగా నున్న నాట్య మండపంలో కల్యాణోత్సవం నిర్వహించబడును.

ఒక్కొక్క వరుసకు 16 చొప్పున 6 వరుసలతో మొత్తం 96 నల్ల రాతి స్తంభాలతో ఈ మండపం నిర్మించబడినది.

ఈ దేవాలయ స్థాపన గూర్చి ఖచ్చితమైన తేది తెలియనప్పటికీ క్రి.శ 1098 –99 కులోత్తుంగ చోళుడు – 1 కళింగ ప్రాంతాన్ని జయించినట్లు చారిత్రకముగా త్రవ్వకాలను బట్టి తెలుస్తుంది. క్రి.శ 1137–56 కాలములో వేలనాడు పరిపాలించిన గొంక-111 వారి సతీమణి రాణి స్వామీ కి బంగారు తాపడం చేసినట్లు మరొక త్రవ్వకాలను బట్టి కనుగొనుట జరిగినది.

తూర్పు చాళుక్యులు ( తూర్పు గంగరాజులు) నరసింహ – 1 ముఖ మండపం, నాట్య మండపం మరియు దాని సమీపములో నున్న వరండాను నల్ల రాతితో చెక్కించినట్లు మూడవ త్రావ్వకాన్ని బట్టి తెలియబడుచు చారిత్రకముగా ప్రసిద్ధిగాంచినది.

ఇచ్చట జరుపబడుచున్న ముఖ్యమైన ఉత్సవములు / పండుగలు

  1. మార్చి/ ఏప్రియల్ నెలలో వరహా లక్ష్మే నరసింహ స్వామీ వారి కల్యాణం,
  2. మే నెలలో చందన యాత్ర
  3. మే నెలలో వైశాఖ పూర్ణిమ

ఈ ఉత్సవములలో చాలామంది భక్తులు పాల్గొంటారు. ఇది మతపరముగా ముఖ్య ప్రదేశమే కాకుండా ప్రకృతి ఆకర్షణతో ప్రాముఖ్యత కలిగియున్నది.

విశాఖపట్నం

మద్రాసు- హౌరా  బ్రాడ్ గేజ్ లైన్ లో నున్న విశాఖపట్నం జిల్లా ప్రధాన కేంద్రముగా, రెవిన్యూ డివిజన్ మరియు మండలం గా కొనసాగుతున్నది. వేలూరు దేవుని పేరు మిద పిలవబడే వైశాఖ లేక కార్తికేయ తదుపరి విశాఖపట్నం గా పిలువబడుచున్నది.

 ఈ పట్టణం బంగాళాఖాతం సముద్ర తీరం వెంబడి నిర్మితమై ‘ డాల్ఫిన్ నోస్’ అని పిలువబడే పర్వత శ్రేణుల మధ్య ఉన్నది. ఇది నల్లరాతి కొండల ప్రాంతంగా తెలియును. ఇది ప్రధాన పారిశ్రామిక మరియు వాణిజ్య కేంద్రంగా విరాజిల్లుటయే కాకుండా, ఇది అందమైన సముద్ర తీర ప్రాంతం మరియు స్వతస్సిద్ధ పచ్చని ప్రాంతమును కలిగియున్నది. పట్టణములో నున్న అమితమైన యుద్ధమునకు / దేవాలయం నిర్మాణం నాకు ఉపయోగపడు మూడు కొండలు కలవు. మొదటి కొండపై ‘ రాస్ హిల్’ అని పిలువబడే రోమన్ కాథలిక్ చర్చి, ఈ మార్గములో కాథలిన్ సంబంధించిన విగ్రహాలు కనబడును. రెండవదైన దారకొండ పై మసీదు మరియు ముస్లిం ప్రవక్త సమాధి కలవు. ఇక్కడ నుండే ఈయన భవిష్యత్తును తెలియజేయుచూ గౌరవింపబడేవారు.. శ్రీ వెంకటేశ్వర స్వామి కొండగా పిలువబడుచున్న 3 వ కొండను ౧౮౮౬ లో కెప్టన్ బ్లాక్ మూర్ వారు వెంకటేశ్వర ఆలయమును నిర్మించిరి. ఇక్కదనున్న ఆంధ్రా యూనివర్సిటి వలన ఈ ప్రాంతం విద్యాపరంగా ఎంత విలువైనదో తెలియుచున్నది. ఈ పట్టణంలో ప్రసిద్ధి గాంచిన ‘ డాల్ఫిన్ నోస్’ తో పాటు 6 4 కి.మీ దూరం వరకు ప్రసరించే 7 మిలియన్ కేండిల్ పవర్ కల్గిన లైట్ హౌస్, హార్బర్, బి.హెచ్.పి.వి., హిందూస్తాన్ షిప్ యార్డ్, హెచ్.పి.సి.ఎల్, కోరమాండల్ ఎరువుల కర్మాగారము, కింగ్ జార్జి ఆసుపత్రి, సర్క్యూట్ హౌస్, రామకృష్ణా మిషన్ సమీపంలో నున్న అందమైన సముద్ర తీరం మరియు విమానాశ్రయం మొ.నవి కలవు.

కైలాసగిరి

350 ఎకరాల స్థలములో నెలవై ఉన్న కైలాసగిరి కొండ చాల చూడ ముచ్చటగా ఉండుటయే కాకుండా ఇచట నుండి సముద్రం వీక్షించు ఆవకాశం కల్గి ఉండుట వలన ఇది నిస్తేజముగా మనకు ప్రకృతి ప్రసాదించిన బహుమానం. ఇచట అభివృద్ధి చేసిన పచ్చని ఉద్యానవన ప్రాంతం, నీటి జల్లులతో కూడిన సముద్ర తీరం ఇటీవల అభివృద్ధి చేసిన పూల తోటలు, మైక్రోవేవ్ రిపీటర్ స్టేషన్ల వలన ప్రముఖ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతుంది. ఈ కొండపై విద్యుదీకరించిన పెద్ద శివపార్వతుల విగ్రహాలుతో పాటు ఇటీవలన నిర్మించిన శంఖు చక్ర మరియు శ్రీ వెంకటేశ్వర నామములు కలవు. ఇచ్చతనుమ్ది సింహాచలం పుణ్యక్షేత్రం నాకు రహదారి కల్పిస్తున్నారు. దీనివలన యాత్రికులను విశేషంగా ఆకర్షించే అవకాసం కలదు. యాత్రికుల సౌకర్యార్ధం కొండ దిగువ నుంచి చూడ ముచ్చటైన కొండలను వీక్షించుటకు గాను ‘ రోప్ వె ‘ నిర్మించిరి.

ఊడా పార్కు

విశాఖ అర్బన్ డెవెలప్ మెంటల్ అథారిటీ వారు అభివృద్ధి ఎంచిన పార్కు తరచుగా మారుచుండు ప్రకృతి విశాల దృశ్యము కల్గి ఉంది డాన్సింగ్ మూజికల్ వాటర్ ఫౌంటేన్, రంగు రంగులలో నీళ్ళను వేదజిమ్ముతూ సంగీతానికి అనుగుణంగా నాట్యం చేసినట్లు అగుపించే దృశ్యమాలిక అపూర్వము. ఇచ్చట పడవ ప్రయాణం (బోటింగ్) స్కేటింగ్ రింక్ ఇవియే కాకుండా గుర్రపు స్వారీ ఓంతెలపై స్వారీ కూడా అందుబాటులో ఉండుట వలన ఇచ్చటకు వచ్చే పిల్లలకు మంచి ఆహ్లాద కరంగా మరియు సంతోషకరంగా నున్నవి . ఈ పార్కులో అన్ని సదుపాయాలతో కూడిన జిమ్నాజియం కూడా కలదు.

లుంబిని పార్కు

          లుంబిని పార్కు సముద్ర తీర ప్రాంతములో ఉన్నది. ఈ పార్కుకి మధ్యలో బుద్ధుని విగ్రహము, ఒక వైపున ప్రసిద్ధి గాంచిన శివం కొండలు మరియుక వైపు నీలపు వర్ణము కల్గిన సముద్ర తీరముతో కల్గి ఉండుట వలన పర్యాటకులను విశేషంగా ఆకర్షింప బడుతుంది

రామకృష్ణా మిషన్

1938 సం.లో రామకృష్ణా మిషన్ ఆశ్రమము సముద్రము ఒడ్డున, ఉదయించే సూర్యకిరణాల శోభతో చూడ ముచ్చటగా నిర్మితమైనది. ఈ ఆశ్రమము భక్తులకు ఆధ్యాత్మిక చింతనపై బోధనలు కల్గించుటయే గాక విద్య, సాంస్కృతిక, వైద్య పునరావాసము మరియు పేదలకు కల్పించుట జరుగుతున్నది.

రామకృష్ణా మిషన్ బీచ్ (సముద్ర తీరం)

 ప్రకృతి సుందరమైన సముద్ర తీర ప్రాంతములో సేద తీరుటకు మరియు ఆహ్లాదము కొరకు ముచ్చటైన రామకృష్ణా బీచ్ కలదు. దీనికి సమీపంగా కాళీ మాత దేవాలయము కొలువై ఉన్నది. ఇక్కదనున్న చేపల ప్రదర్శన కేంద్రం (అక్వేరియం) మరియొక ఆకర్షణగా ఉన్నది. సముద్రపు అలల గోషా ఇచ్చటకు విచ్చేయు సందర్శకులకు చెప్పలేనంత ఆనందం కలుగజేస్తుంది.

ముడసర్లోవ

విశాఖపట్నం ప్రాంతానికి 10 కి.మీ దూరములో ప్రకృతి సిద్ధంగా కొండల మధ్య ఏర్పడిన లోయ ముడసర్లోవ కలదు. ఇది ఒక సరస్సు. దీని ద్వారా పట్టణ పరిపాలన సంస్థ వారు దీనిని అందమైన పార్కు అభివృద్ధి చేసి, వివిధ జాతుల పచ్చని మొక్కలు, చెట్లు పెంచుటయే గాక చక్కని పండ్ల తోటలను కల్గియుండుట వలన, ఇది ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి గాంచి, ఎక్కువ మంది యాత్రికులను మరియు ప్రజలచే ఆకర్షింపబడుచున్నది.

డాల్ఫిన్ నోస్

విశాఖపట్నంలో ప్రాధాన్యమైన డాల్ఫిన్ నోస్ అనునది 358 మీ. సముద్ర మట్టానికి ఎగువన, 174 మీ ఎత్తు కల్గిన శిలా పర్వత కేమ్ద్రముపై సముద్రం నుండి చొచ్చుకొని వచ్చి, డాల్ఫిన్ చేప నోటి ఆకారం కల్గి ఉన్నది. లైట్ హౌస్ దీప స్థంబము సముద్రపు ఒడ్డున గల రాతిపై నిర్మించబడి, 65 కి.మీ సుదూర ప్రాంతం వరకు దిశా నిర్దేశం చేయబడును.

రాస్ హిల్

సముద్ర తీరాన నెలకొన్న ప్రసిద్ధి గాంచిన రాస్ హిల్ మూడు మతాల సామరస్యానికి ప్రతీకగా అనగా దారకొండపై నెలకొన్న మసీదు మరియు ముస్లింల తెగకు సంబంధించిన లష్కే మదీనా పుణ్యక్షేత్రం . 1886 సంలో కెప్టెన్ బాక్ మూర్ నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామీ దేవాలయ కొండ , మూడో కొండపై క్రైస్తవులకు పుణ్య మరియు ప్రవిత్ర స్థలమై ‘ వేలంగిని మాత’ దేవతా ఆలయం కల్గి మూడు మతస్తుల మధ్య అనుబంధాన్ని తెలియజేస్తున్నది.

సముద్రంపై విజయం

1996 సం.లో యుద్ధ స్మృతి చిహ్నం (సముద్రం పై విజయం) గా తూర్పు నౌకాదళపతి వారిచే నిర్మించబడినది. ఇది ఇండియన్ నేవీ ఒక్క 1971 విజయానికి చిహ్నంగా కట్టబడినది. చూడ ముచ్చటైన ప్రాంతము మరియు రంగుల ఫౌంటేన్తో పాటు సమీపంగా ఏర్పాటు చేసి అతి భయంకరమైన యుద్ధ ట్యాంక్ అజంతా మరియు యుద్ధవిమానము దీనికి మరింత శోభను తెచ్చి పెట్టుతుంది.

కాళీ దేవాలయము

1984 సం.లో సముద్రపు తీర ప్రాంతంలో భావతారని చారిటబుల్ ట్రస్ట్ వారిచే ప్రసిద్ధ కాళీ దేవాలయం నిర్మించబడినది. దేవాలయ ఆకృతి ఒక ప్రత్యెకతను కల్గి యున్నది. 10 కి.గ్రా బరువు కల్గిన ఏకశిలతో నిర్మితమైన శివలింగం, రాసలింగంగా పిలువబడుతూ, ప్రత్యేకతను కల్గి యున్నది.

 కురుపాం స్థంభం

100 సం.ల క్రితం కురుపాం రాణిగారి జ్ఞాపకార్ధము కట్టబడిన ఒక స్థూపం కలదు. దీని గోమటము మరియు శిఖరం అద్భుతమైన శిలా నైపుణ్యాన్ని కల్గి ఉండుటయే కాక, ఇదే కట్టడం పై చెక్కబడిన దేవతలు, స్మృతి చిహ్నాలు / పుష్ప అలంకరణలు మరియు వివిధ ఆకాంతస్ (ఆకులు ) ప్రత్యేకతను కల్గి ఉండును

సబ్ మెరైన్ మ్యూజియం

యుద్ధ అవసరాల కొరకు నిర్మించి, అవసరం తీరి మిగిలిన జలాంతర్గామి ‘ కురుసుర’ (సబ్ మెరైన్) ను రామకృష్ణా బీచ్ ఇసుక తిన్నెలపై చేర్చి, తదుపరి దానిని అభివృద్ధి పరచి, ఒక మ్యూజియం గా తీర్చిదిద్దిరి. ఈ ప్రాజెక్టును తూర్పు నౌకాదళం మరియు ఎం.ఎస్.డి.ఆర్. లు సంయుక్తముగా చేపట్టుట జరిగినది. ఈ ప్రాజెక్ట్ అంచనా విలువ దాదాపు 2.55 కోట్లు మరియు ఆసియా ప్రాంతములో మొట్ట మొదటి, ప్రపంచంలో రెండవది. ఇది ప్రజల సందర్సానార్ధము ప్రారంభింపబడినది.

విశాఖపట్నం మ్యూజియం

1991 సం.లో నిర్మితమైన విశాఖ మ్యూజియం, పెద్దలు సంపాదించిన సొత్తు. విశాఖకు చెందిన సామాజిక మరియు సాంస్కృతిక అంశాలను భద్ర పరచు స్థలంగా కొనసాగింపబడుచున్నది.

యారాడ బీచ్

యారాడ కొండలచే చుట్టుబడి ఒక లోయగా ఉండుటయే కాకుండా, ఆహ్లాదకరమైన సముద్ర తీరముతో చక్కని రాళ్ళు మరియు నున్నని గులక రాళ్ళతో ఆవరించ బడి, బంగారపు వర్ణం కల్గిన ఇసుక నేలను కల్గి కొండలపై ఆకర్శణీయమై పచ్చని చెట్లతో చూడ ముచ్చటైన ఆకృతిని కల్గి. యాత్రికులను విశేషంగా ఆకర్షించు చున్నది.

గంగవరం బీచ్

గంగవరం బీచ్ విశాఖపట్నం స్టిల్ ప్లాంట్ కు సమీపములో ఉన్నది. అందమైన ప్రదేశము అగుటచే, చిత్ర పరిశ్రమ దార్లను మరియు యాత్రికులను విశేషంగా ఆకర్షించుచున్నది

ముత్యాలమ్మపాలెం బీచ్ మరియు క్రీక్

శ్యామల కొండగా పిలవబడుచున్న చిన్నకొండ, దీనికి ఎదురుగానున్న సముద్ర తీరం చాల ఆకర్షణీయంగా మరియు అందంగా ఉంటుంది. సముద్ర తీర ప్రాంతం మరియు కొండకు మధ్యనున్న పాయ గుండా సముద్రములోనికి ప్రవాహం  ‘L’ ఆకారములో ఉంటుంది, చూచుటకు ఆహ్లాదకరంగా నుండును. ఇది ప్రశాంతముగా మరియు శాంతియుతమైన ప్రదేశం.

రుషికొండ బీచ్

విశాఖపట్నం నకు 8 కి.మీ దూరంలో నున్న రుషికొండ శుభ్రమైన బంగారపు వర్ణ సముద్ర వర్ణ సముద్ర తీరాన్ని కల్గి ఈత కొట్టుటకు అనువుగా ఉంటూ మరియు ఇచట సముద్ర అలలకు కొట్టుకొని వచ్చు నురుగు ఆకర్షనీయమైన చిత్రీకరణకు అనువుగా నుండి, ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ వారు నిర్మించిన 12 సొగసైన కాటేజీల నుండి సముద్రమును వీక్షించుటకు ఆవకాశం కల్గి ఉండుటయే గాకుండా, అనుకూలమైన ఆవాసానికి అనుకూలంగా ఇక్కడికి వచ్చు యాత్రికులకు అనువుగా ఉన్నది. ఇచట ఈత కొలను మరియు ఇచట దిమ్మలపై నీటిపై ఆటలు ఆడుటకు అవకాశం కల్పించాలని సంకల్పించిరి.

తోట్ల కొండ

రాతితో వివిధ ఆకృతులలో, ఆకారములలో, పరిమాణంలో నిర్మించబడిన మంచి నీటి కొరకు నిర్మించిన 4 నుండి 8 మెట్లు కల్గిన సరస్సుల వలన ఈ కొండ ప్రాంతాన్ని తోట్ల కొండగా పిలువబడుచున్నది. ఇది సముద్ర ప్రాంతానికి 128  మీటర్ల ఎగువన విశాఖపట్నంనకు 15 కి.మీ దూరంలో నున్నది. పురావస్తు త్రవ్వకాలలో బయలుపడిన మహాస్థూప విహారాలు, ఒటివ్ స్థూపాలు, చైత్య గృహాలు, స్తంభాలతో నిర్మించిన మందిరం, సభా ప్రాంగణాలు, పెంకుల్, బుద్ధుని పాదముద్రికలు, మంగమారి కొండ ప్రాంతములో బయల్పడిన బ్రహ్మలిపితో చెక్కబడిన వాటిని బట్టి కళింగ మరియు అంధకా బౌద్ధపాఠశాలలుఉన్నట్లు గోచరింపబడినవి .