తూర్పు ప్రాంత మణిహారంగా ప్రసిద్ధిపొందిన, నౌకాశ్రయ కేంద్రముగ పేరొందిన విశాఖపట్నం తూర్పు కనుమల నడుమ మరియు తూర్పున బంగాళాఖాతం సరిహద్దుగా కల్గి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో భారత దేశమునకు తూర్పు సముద్ర ప్రాంతములో నెలకొన్నది. విశాఖపట్నం జిల్లా ముఖ్య పరిపాలనా కేంద్రముగా మరియు నావికాదళ తూర్పు ప్రాంత నేవల్ కమాండ్ ముఖ్య కేంద్రముగా విశాఖపట్నం కొలువై ఉన్నది.
550 చ.కి.మీ విస్తీర్ణం కల్గి ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం అతిపెద్ద పట్టణ ప్రాంతముగా విరాజిల్లుతుంది. ఇది ప్రాథమికముగా పోర్ట్ సిటి / నౌకాశ్రయ కేంద్రము అయినప్పటికీ పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందినవి. ఇది నౌకాదళ తూర్పు ప్రాంత నేవల్ కమాండ్ కు ముఖ్య కేంద్రము
చరిత్ర ;- వాలర్ దేవుని పేరు మీదుగా పట్టణానికి విశాఖ అని నామకరణం చేయబడినది అని చరిత్రద్వారా తెలియుచున్నది. ఇది క్రి.పూ 260 లో అశోకుని పరిపాలనలో కళింగ సామ్రాజ్యంలో భాగమై ఉన్నది. తదుపరి ఇది ఆంధ్ర ప్రాంతానికి చెందిన వేంగి రాజుల ఆధీనమైనది. తదుపరి ఈ ప్రాంతమును పల్లవులు, చోళులు మరియు గంగా సామ్రాజ్యపు రాజులచే పరిపాలన గావించబడినది . 15వ శతాబ్ధములో ఇది విజయనగర సామ్రాజ్యములో భాగమైనది.
తదుపరి ఇది ఒక మంచి పర్యాటక కేంద్రముగా విరాజిల్లుచున్నది / పిలవబడుచున్నది. ఈ ప్రాంతము సరస్సులు, చల్లని సముద్ర ప్రాంతము చూడ ముచ్చటైన కొండ ప్రాంతము, మరియు లోయలతో కూడి వుంటుంది. ఈ జిల్లాలో అనేక పర్యాటక ప్రాంతములను కలిగి యుండి , ఈ ప్రాంత సంస్కృతి మరియు నాగరికత భారత దేశ ఔన్నత్యాన్ని ఇనుమడింపచేస్తుంది.