ముగించు

జిల్లా పంచాయత్ ఆఫీసు

పంచాయితీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా పంచాయితీ అధికారి ఉంటారు. ఇతను గ్రామ పంచాయితిల పనితీరు మరియు పరిపాలనను పర్యవేక్షిస్తారు. అం.ప్ర. పంచాయితీ రాజ్ చట్టము 1994 ప్రకారము గ్రామ పంచాయితీల పరిపాలన కొనసాగింపబడును.

పరిధి :

జిల్లాలోని 925 గ్రామ పంచాయితీలు 39 మండలాలలో 3 రెవిన్యూ డివిజన్ల పరిధిలో ఉన్నది. 4 రెవెన్యూ డివిజన్లగా విభజించినప్పటికీ, డివిజినల్ పంచాయితీ అధికారి, ఇతర సిబ్బంది మరియు మౌళిక సదుపాయాలూ అనకాపల్లి రెవెన్యూ డివిజన్ కు కేటాయించనందున లోగడ ఉన్న 3 రెవెన్యూ డివిజన్ల గా కొనసాగింపబడుతూ, వాటి ఆధారంగా విధులు నిర్వహించుట జరుగుతున్నది.

గ్రామ పంచాయితీ ముఖ్య విధులు

అం.ప్ర పంచాయితీ రాజ్ చట్టం 1994, సెక్షన్ 45 ప్రకారము క్రింద నుదహరించినవి గ్రామ పంచాయితీలు నిర్వహించ వలసిన ముఖ్య విధులు / పనులు.

  • మంచి నిటి సౌకర్యం కల్పన
  • ఆరోగ్య రక్షణ / పరిశుభ్రత మరియు ప్రజారోగ్యము కల్పన
  • వీధి దీపాల ఏర్పాటు
  • అను సంధాన రహదారులు మరియు మురుగు కాల్వల ఏర్పాటు

 

గ్రామ పంచాయితీలకు వనరుల లభ్యత / మూలాధారము

పన్నులు :

  • ఇంటి పన్ను
  • ప్రకటన పన్ను
  • కొలగారము / కాటా రుసుము
  • ఖాళీ స్థలము లేక భూమిపై పన్ను
  • వాహన పన్నులు
  • నీటి సరఫరా, మురుగు కాలవలు వీధి దీపాలు మొదలైన వాటిపై వినియోగ పన్ను

హక్కులు : 

  • ఇంటి పన్నులు
  • ప్రకటన పన్ను
  • కొలగారము / కాటా రుసుము
  • ఖాళి స్థలములేఖ

పన్నేతర :

  1. దుకాణాలు / వ్యాపార సంస్థలు / ఇతర స్థాపనములుఏర్పాటు కొరకు లైసన్స్ పన్ను, వర్తకము, జల ప్రవాహం / జల రవాణా ద్వారా జరుపు వాటిపై పన్ను
  2. వర్తకము జల ప్రవాహం / జలరవాణా ద్వారా జరుపు వాటిపై పన్ను.
  3. లే అవుట్ల క్రమ బద్ధీకరణ / అనుమతుల నను
  4. బిల్డింగ్ ప్లానుల అనుమతిపై పన్ను.
  5. సెల్ టవర్లు ఏర్పాటుపై పన్ను
  6. సెల్ టవర్ల రెన్యునల్ పై పన్ను
  7. పశువుల శాలపై పన్ను
  8. కూరగాయలు మరియు మాంసం దుకాణాలపై పన్ను.
  9. చేపల చెరువులు
  10. వాణిజ్య సముదాయములు
  11. ఎరువు
  12. పోరంబోకు స్థలం
  13. పండుగలు మరియు ఉత్సవాలు
  14. ఫలసాయము వచ్చు రాబడిపై పన్ను
  15. రేవులు
  16. బండ్ల నిలుపు స్థలంపై పన్ను
  17. నిల్వలు
  18. తిరిగి ఇచ్చు నిల్వలపై
  19. ప్రయివేట్ / వ్యక్తిగత కుళాయిల ఏర్పాటు పై పన్ను

14 వ ఆర్ధిక సంఘము నిధులు / గ్రాంట్లు

  • వృత్తి పన్ను గ్రాంట్
  • తలసరి ఆదాయ గ్రాంట్
  • సర్పంచి గౌరవ వేతనం
  • లాభ భాగము

పై నిధులు గ్రామ పంచాయితీల వారీగా అందని జనాభా ఆధారముగా విడుదల చేయబడును

డిజిటల్ పంచాయితీలు – సేవలు – ప్రభుత్వం నుంచి ప్రజలకు

  • వివాహ రిజిస్ట్రేషన్
  • ఆస్తి మదింపు పన్ను
  • మార్పు
  • నిటి కుళాయి కనెక్షన్
  • చిన్న, మధ్య తరహా మరియు భారీ పరిశ్రమల ఏర్పాటు కొరకు నిరభ్యంతర పత్రము జారి.
  • భవనమునకు అనుమతి / మంజూరు
  • లే అవుత అనుమతి / మంజూరు
  • జనన మరియు మరణ రిజిస్ట్రేషన్
  • ఇంటి పన్ను
  • వ్యాపార లైసెన్స్
  • NREGA ఉద్యోగ కార్డులు / జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధక ఉద్యోగ కార్డులు

ఇతర దరఖాస్తులు

PRIA SOFT – పంచాయితీ రాజ్ సంస్థల అకౌంటింగ్ సాఫ్ట్ వేర్

URL : (accountingonline.gov.in)

గ్రామ పచాయితీలలో జరుగు అన్ని ఆర్ధిక లావాదేవీలు (చెల్లింపులు / రసీదులు (పుచ్చుకొనుట ) లను ఎప్పటి కప్పుడు మదింపు చేయును.

ఆన్ లైన్ ద్వారా గ్రామ పంచాయితీలలో జరుగు అన్ని ఆర్ధిక సంబంధమైన వివరాలు / పుస్తకాలను నిర్వహించును.

పంచాయితీ రాజ్ సమాచారము వ్యవస్థ

URL : pris.ap.gov.in

గ్రామాల వారీగా వ్రామ పంచాయితీ లో నివసించు అందరి గ్రామస్థుల యొక్క ఇంటి పన్నును మదింపు / అప్ లోడ్ చేయు అవకాశం కలదు.

స్కీములు / పధకములు

గ్రామ పంచాయితిలకు ఆరోగ్య రక్షణ కల్పించుట ముఖ్య బాధ్యత. దీనితో పాటు పొడి చెత్త యాజమాన్య నిర్వహణ ఒక మంచి అలవాటు ఏలనగా చెత్తను తిరిగి మరియొక విధముగా ఉపయోగించుట.

జిల్లాలో గల 9 2 5  గ్రామ పంచాయితీలలో ఇప్పటికే 72 గ్రామ  పంచాయితీల పొడి చెత్త యాజమాన్య నిర్వహణను నిర్వహిస్తున్నాయి. ఇంటి ఇంటికి వెళ్లి సేకరించిన చెత్తను రీ సైక్లింగ్ (తిరిగి ఉపయోగించు పద్ధతి) ద్వారా గ్రామ పంచాయితీలు 70,000 కేజీల సేంద్రియ ఎరువును ఉత్తత్తి చేయుచున్నవి.

LED పధకం / ప్రాజెక్ట్

అం.ప్ర ప్రభుత్వం వారు విధి దీపాలను ఎల్.ఇ.డి దిపాలుగా మార్చాలని నిర్ణయింఛినారు. ఈ జిల్లాకు సంబంధించిన, పైన ఉదాహరించిన పధక అమలగు NREDCAP (జాతీయ గ్రామిన ఉపాధి కల్పనా సంస్థ, అం.ప్ర) వారికి అప్పగించుట జరిగినది.

925 గ్రామ పంచాయితీ లలో 201 గ్రామ పంచాయితీ లలో ఇప్పటి వరకు 37,565  ఎల్.ఇ.డి. బల్బులను అమర్చుట జరిగినది

సంప్రదించ వలసిన వారి వివరములు

జిల్లా పంచాయితీ అధికారి, విశాఖపట్నం , మహారాణి పేట పోస్టు 530002

ప్రస్తుతం : శ్రీమతి వంగా కృష్ణకుమారి

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు    :               0891–2563567

ఫ్యాక్స్                                         :               0891-2794148

మొబైల్                                :                9849902156

సంస్థ నిర్మాణ పటం

  1. అంధ్రప్రదేశ్ ప్రభుత్వము
  2. పంచాయితీ రాజ్ మరియు గ్రామిణాభివృద్ధి శాఖ
  3. కమిషనర్, పంచాయితీ రాజ్ మరియు గ్రామిణాభివృద్ధి శాఖ
  4. జిల్లా కలక్టర్
  5. జిల్లా పంచాయితీ అధికారి
  6. డివిజన్ పంచాయితీ అధికారి, విశాఖపట్నం, డివిజన్ పంచాయితీ అధికారి, నర్సీపట్నం & డివిజన్ పంచాయితీ అధికారి, పాడేరు
  7. ఎక్స్ టెన్షన్ అధికారి
  8. పంచాయితీ సెక్రటరీలు

సంబంధిత వెబ్‌సైట్ల జాబితా

  1. www.mydepartments.in/prrws/
  2. www.accountingonline.gov.in
  3. www.digitalpanchayat.ap.gov.in
  4. www.nrega.ap.gov.in