పసుసంవర్ధకశాఖ – ఋతువుల స్థితిగతులు / శీతోష్ణస్థితి – నివారణ చర్యలు
- భవనములు : జూన్ 2010లో కురిసిన భారీ వర్షాలకు ,14 భవనములు ధ్వంసం కాబడినవి. కనుక మరమ్మత్తులు చేపట్టుటకు తక్షణం రూ. 44,00,000 /- కావలసియున్నవి.
- ఔషధములు మరియు మందులు : భారీ వర్షాల కారణంగా, పశువులకు పెద్ద సంఖ్యలో జబ్బుల బారిన పడుట మరియు దెబ్బలు తగులుటకు చాల అవకాశము కలదు. వీటి కొరకు సంబంధిత ఔషధములు తక్షణావసరం 3 మరియు 4 క్వార్తర్లకు సంబంధించి గత సం.లో ఔషధ మరియు మందుల కొనుగోలుకు ఎటువంటి నిధులు విడుదల కాలేదు. కనుక తక్షణం 20 లక్షలు ప్రత్యెక అవసరార్ధ ఔషధములు అందుబాటులో ఉంచుటకు కావలసియున్నది.
- ఆహారోత్పత్తి / పశుగ్రాసం : భారీ వర్షాల మూలముగా ఎండు గడ్డి కుళ్లుట వలన మరియు వరదలలో కొట్టుకు పోయే అవకాశం వలన కావలసిన పరిమాణంలో లభ్యమయ్యే అవకాశం ఉండదు. కావున ఏదైనా విపత్తు సంభవిస్తే, నివారణ కొరకు మరియు ఎండుగడ్డి అందుబాటులో ఉంచుటకు తక్షణం 10 లక్షల రూ.లు అవసరమై ఉన్నది.
పట్టిక
భవనముల మరామత్తుల కొరకు అవసరమైన నిధులు – 44.00 లక్షలు
ఔషధాలు మరియు మందుల కొరకు అవసరమైన నిధులు – 20.00 లక్షలు
ఆహారోత్పత్తి / పశుగ్రాసం కొరకు అవసరమైన నిధులు – 10.00 లక్షలు
——————————————————————————————————————–
మొత్తం – 74.00 లక్షలు
———————————————————————————————————————