శాఖ గురించి:
విశాఖపట్నం జిల్లా ప్రధానముగా సముద్ర సామీప్యము గలది. విశాల సముద్ర తీర ప్రాంతములో నివసించు మత్స్యకార్ల జీవనోపాధి చేపల వేట పై ఆధారపడియున్నది. మత్స్య కార శాఖ ప్రధానముగా అన్ని జనవనరులలో లభ్యమగు ఆస్తిని / సంపదను పట్టుకొని తన వ్యక్తిగత లాభమును పెంపొందించు కొనుటకు, జీవనాన్ని మెరుగుపరచుటకు చేపల ఉత్పత్తి కొరకు చేపలనుత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయుట మరియు సంతృప్తికర అభివృద్ధి కొరకు దిగుబడిని పెంపొందించుట ప్రధాన ఆశయం . ఈ శాఖ ప్రధానముగా చేపల ఎగుమతి ద్వారా వచ్చే ఆదాయం మరియు మత్స్యకార్ల సంక్షేమమే లక్ష్యం కాకుండా వారికి ఆహారభద్రత, పోషకాలు మరియు ఆరోగ్యం కల్పించుటయే గాక గ్రామీణ ప్రజానీకానికి జీవన మనుగడ భద్రతా కల్పించుట కూడా చూచును.
మత్స్య శాఖ యొక్క ప్రాముఖ్యత రాష్ట్ర గృహ సంబంధ ఉత్పత్తికి ప్రత్యెక ప్రభావమున్న దృష్ట్యా మరియు ప్రపంచీకరణ దృష్ట్యా వివిధ ఉపాధి అవకాశాలు కల్పించుట వలన దీనిని గుర్తెరిగి, ఆర్ధిక అభివృద్ధి యంత్రంగా గుర్తించిరి.
శాఖ ఆశయాలు :
- రొయ్యలు మరియు చేపల పెంపకము మరియు దిగుబడిని పెంపొందిచుట
- వాతావరణ పరిస్థితులకనుగుణంగా సాధ్యమైనంత వరకు జలవనరులను ఉపయోగించుకొని మత్స్య సంపదను పెంపొందిచుట
- తలసరి చేపల వినియోగం పెంపొందించుట.
- మత్స్య శాఖాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయములు కల్పించుట
- మత్స్య కారులకు సంక్షేమ పధకాలు చేపట్టుట
- శాఖ సామర్ధ్య పెంపుదల
- సంపాదన ద్వారా మహిళా సాధికారిత సాధించుట
- శితలికరణ సదుపాయాల ద్వారా నాణ్యత పెంపుదల, పోషక విలువలకు రక్షణ కల్పించుట మరియు మత్స్య సంపద యొక్క విలువను పెంచుట
మానవ మరియు మత్స్యవనరులు :
అంశం పేరు | వివరములు | |
---|---|---|
సముద్ర సామిప్య మత్స్య సంస్థ సముద్రతీర ప్రాంతము | 132 కి.మీ | |
సముద్ర తిర గ్రామాలు | 63 | |
చేపల బట్టీలు / చేపలు పట్టు కేంద్రాలు | 44 | |
మత్స్యకారుల జనాభా | 1.16 లక్షలు | |
మత్స్యకార వృత్తి జనాభా | 5157 | |
ప్రధాన మత్స్య నౌకాశ్రయం | 1 | |
శుభ్ర పరచు కేంద్రాలు | 24 | |
శితలికరణ కేంద్రాలు | 14 | |
ఐస్ కర్మాగారాలు | 18 |
సముద్రమునకు దూరముగా నుండు ప్రదేశాలలో మత్స్యశాఖ / లో ప్రదేశపు మత్స్య సంస్థ:
అంశం పేరు | వివరములు | |
---|---|---|
చెరువులు | 1179 | |
రిజర్వాయర్లు | 20 | |
నిటి లభ్యత | 18043 హెచ్.ఎ | |
లోప్రదేశపు మత్స్యకార్ల జనాభా | 0.10 లక్షలు | |
బ్రేకిష్ నీటిలో చేపల పెంపకము | 683 హెచ్.ఎ | |
మంచి నిటి కొలనులో చేపల పెంపకం | 107.66 హెచ్.ఎ | |
చేపల అభివృద్ధి కేంద్రాలు | 35 | |
రొయ్యల పెంపక కేంద్రాలు | 3 | |
చేపల ఆహార సంస్థలు | 3 |
చేపలు మరియు రొయ్యలు గత 10 సం.లలో లభ్యత
సంవత్సరము | సముద్రపు చేపలు | లో ప్రదేశపు (నదులు / చెరువు చేపలు ) | సముద్రం / నదులద్వారా, మరియు పెంపకం ద్వారా రొయ్యల లభ్యత | మొత్తంఉత్పత్తి |
---|---|---|---|---|
2007-08 | 49448 | 2806 | 7318 | 59572 |
2008-09 | 54777 | 2816 | 10024 | 67617 |
2009-10 | 52578 | 2738 | 6613 | 61929 |
2010-11 | 59037 | 4361 | 9402 | 72800 |
2011-12 | 69982 | 6932 | 16455 | 93369 |
2012-13 | 73523 | 6630 | 16100 | 96253 |
2013-14 | 78585 | 8050 | 18654 | 105289 |
2014-15 | 85620 | 8461 | 22095 | 116176 |
2015-16 | 89084 | 10289 | 26690 | 126063 |
2016-17 | 105441 | 14133 | 35008 | 154582 |
2017-18 | 106704 | 14000 | 43700 | 164404 |
(సోపానము : మత్స్య శాఖ)
విశాఖపట్నం పోర్టు ద్వారా ఎగుమతి కాబడిన సముద్రపు ఆహార పదార్ధాలు ( రూ. కొట్లలో)
సంవత్సరము | భారత దేశం | అంధ్రప్రదేశ్ | విశాఖపట్నంపోర్టు | భారత దేశముఆధారముగా ఉత్పత్తి శాతం | అంధ్రప్రదేశ్ఆధారముగా ఉత్పత్తి శాతం |
---|---|---|---|---|---|
2013-14 | 30213 | 12000 | 6826 | 22.59 | 56.88 |
2014-15 | 33441 | 15000 | 7578 | 22.66 | 50.52 |
2015-16 | 30420 | 13500 | 7161 | 23.54 | 53.06 |
2016-17 | 37871 | 17000 | 9300 | 24.5 | 54.71 |
(సోపానము : MPEDA మరియు మత్స్య శాఖ )
విస్తరణ మరియు శిక్షణ కార్యక్రమములు
మత్స్యకార్లకు మరియు రొయ్యల పెంపకం దార్లు / రైతులకు వృత్తి సామర్ధ్యాలను పెంపొందించుటకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించుట ఈ సంస్థ యొక్క ప్రధానమైన క్రియ / పని. ఈ శాఖకు ఉపయోగపడు అభివృద్ధి చెందిన సాంకేతికతను మరియు అప్రయత్న / సులభమైన పద్దతులను ఆచరించుట ద్వారా ఎక్కువ దిగుబడి / రాబడి పొందుటకు ఈ శాఖలో పనిచేస్తున్న క్షేత్ర సిబ్బంది అనగా చేపల అభివృద్ధి అధికార్లు మరియు చేపల సహాయ తనిఖి అధికారి వారలు తరచుగా రొయ్యల పెంపకం దార్లు / రైతులకు , కొ-ఆపరేటివ్ సొసైటి సభ్యులకు, సముద్ర తిర మత్స్య కార్లకు మరియు మత్స్యకారిణులకు శిక్షణా కార్యక్రమములు చేపట్టుట జరుగుచున్నది. మంచి యాజమాన్య పద్ధతులను చేపట్టి సామూహికంగా రొయ్యల పెంపకం విస్తీర్ణము సద్వినియోగం చేసుకోనునట్లు చూచుట, రొయ్యల పరీక్షా కేంద్రాల ద్వారా రొయ్యల రైతుకు సాంకేతిక సేవ అందించుట కొత్తూరు, భీమిలి నందు ఏర్పాటు చేయబడి రొయ్యల పరీక్షా కేంద్రము నిత్యం రొయ్యల పెంపకం దార్లు / రైతులకు భూమి, మరియు నీటి పరిశీలన, రోగాల నిర్ధారణ, అంశాలతో పాటు రొయ్యల రైతులను వాతావరణ అనుకూల మరియు అనుకూల సాధ్యమైన రొయ్యల పెంపకం పద్ధతులపై అవగాహన మరియు విద్యా వంతులను చేయుట అనునవి నిత్యం చేపట్టుచున్నది .
రోజు వారి / క్రమబద్ధికరించిన కార్యక్రమములు :
- 1994 ఎం.ఎఫ్. ఆర్ యాక్టు అమలు : చేపల వేట నిషేధకాలము, వల ఆకార క్రమబద్దీకరణ తదితరాలను పాటిస్తూ చేపల / మత్స్య సంపద నిల్వలకు రక్షణ చర్యలు చేపట్టుట
- ఎం.ఎస్. యాక్ట్ 1 9 5 8 అనుసరించి సముద్రంపై మత్స్యవేట కొనసాగిస్తున్న వారికి ఆన్ లైన్ దృవికరణ చేయుట మరియు బయోమెట్రిక్ ద్రువికరణ పత్రాలు సముద్రయాన రక్షణ దృష్ట్యా జారి చేయుట
- అనుమతి పొందిన రిజర్వాయర్లలో మత్స్య సంపాదకు రక్షణ మరియు క్రమబద్దికరించుట.
- సముద్రతీర రొయ్యల పెంపకం సంస్థ, భారత ప్రభుత్వము వారి యాక్టును బ్రాకిష్ నిటి ద్వారా చేపట్టిన రౌయ్యాల చెరువులకు రక్షణ మరియు నమోదు చేయుట
- ఎప్.సి.ఎస్ / తగాదాల అంశాలలో కొ-ఆపరేటివ్ యాక్టు 1 9 6 4 అమలు చేయుట
- జి.ఓ.ఎం.ఎస్.నేఁ 7, ఎ.హెచ్, డి.డి & ఎఫ్ తేది 16-3-13 ప్రకారము డి.ఎల్.సిల ద్వారా చెరువులకు నిర్మాణమునకు లైసెన్సుల మంజూరు మరియు చేపల పెంపకంను మంచి నీటిలో చేపట్టుటను క్రమబద్ధికరించుట
- ఎ.డి. ఆక్వా కల్చర్ సీడ్ (క్వాలిటి కంట్రోల్) యాక్ట్ 2 0 0 6 అం.ప్ర రొయ్యల పెంపకం విత్తనా యాక్టు 2 0 0 6 ను దిగుబడి పెంపుదల కొరకు మరియు లేబరేతరి ద్వారా రోగ నిర్ధారణ కావింప బడిన పిల్లలను పొడుగు కేంద్రాలకు నాణ్యమైన ఆహారము / గింజలను సరఫరా చేసేటట్లు చూచుట
- జిల్లా స్థాయి కమిటిల ద్వారా జి.ఓ.ఎం.ఎస్.నెం 2, ఎ.హెచ్, డి.డి & ఎఫ్ తేది 11.01.2017 ప్రకారము నిషేధిత అంటురోగ నివారణ ఔషధాలు, రొయ్యలు/ చేపలు పెంచుటకు, పిల్లలను పొదుగు కేంద్రాలకు మరియు ఆహార అనుబంధాలకు చేరకుండా క్రమబద్ధికరణ చేయుట
రెండంకెల అభివృద్ధి మత్స్య శాఖలో సాధించుటకు వ్యూహ రచనలు
సముద్ర తిర మత్స్య శాఖ సంస్థ
- సముద్ర గర్భంలో నున్న సముద్రపు వనరులను ట్యూనా చేపల వేటను ప్రోత్సహించుట ద్వారా అభివృద్ధి / సద్వినియోగం చేయుట
- సముద్ర తిర మత్స్యకారులకు జీవనోపాధి మరియు ఉత్పత్తిని పెంపుదల చేయుట కొరకు సముద్రపు జలాలలో వేటకు వల సంస్కృతిని పెంపుదల చేయుట
- సముద్రములో మత్స్య వనరులను కాపాడుకొనుటకు గాను ప్రతి సంవత్సరం ఏప్రియల్ 1 5 నుండి జూన్ 1 4 వరకు సముద్రంలో మత్స్య వేటను నిషేదించేటట్లు చూచుట
- నాణ్యతను కాపాడుటకు శితలికరణ కేంద్రాల ఏర్పాటును ప్రోత్సహించుట
- పంట కోత కాలము తదుపరి మరియు విలువ ఆధారిత పద్ధతులు
- సురక్షిత మరియు నాణ్యమైన ఉత్పత్తి కొరకు సరియైన మౌలిక వసతుల కల్పన
- సముద్ర రక్షణ, సార్థకమైన సముద్ర సమాచార వ్యవస్థ మరియు ఆపద సమయంలో సంసిద్ధత కొరకు నౌకల పర్యవేక్షణ పధ్ధతి
- శాటిలైట్ పి.ఎఫ్.జడ్. డేటా అనుసంధానం ద్వారా మత్స్యకార్లకు ఎక్కువ చేపల లభ్యత వివరాలు
- సామాజిక ఆర్ధిక అభివృద్ధి కొరకు మత్స్యకార్లకు సంక్షేమ పధకాల అమలు
రొయ్య పెంపక కేంద్రం
- ఆచరణాత్మక అభివృద్ధి ప్రయత్నాలను సామూహికంగా చేపట్టుట ద్వారా
- రోగ నివారణ మరియు పర్యవేక్షణ
- ఉన్నత ప్రకృతి సంరక్షణ పద్ధతులు
- సేంద్రియ పధ్ధతి ద్వారా రొయ్యల పెంపకం ను ప్రోత్సహించుట
- Mu-crab మరియు seebags పెంపకము అను ప్రత్యెక జాతుల పెంపకం
- మట్టి కూరుకోనకుండా మరియు క్రిక్స్ (రాళ్ళు) లను తవ్వుత ద్వారా సక్రమ నిటి ప్రవాహం కల్పించుట
- రొయ్యల దిగుబడిని నిషిద్ధ అంటురోగ ఔషధాలు వాడక క్రమబద్దీకరణ
- సక్రమ ఆరోగ్య నిర్వాహణ కొరకు మొబైల్ ల్యాబ్ సేవల వినియోగం
- స్రింప్ పిల్లల పెంపకం కేంద్రాలను మరియు నాణ్యమైన రొయ్యల కేంద్రాల ఏర్పాటు
- స్రింప్ పిల్లల పెంపక చెరువులను జియోటాగింగ్ చేయుట మరియు నిర్ధారణ / కనుకోనేటట్లు చేయుట
లో సముద్రపు చేపల కేంద్రము
- అభివృద్ధి చెందిన చేప పిల్లల నిల్వ మరియు
- స్కామ్ప్ మరియు పంగాస్సిస్ ల పెంపకం ఒకదాని తర్వాత మరోకోటి
- వశపరచుకోను పిల్లల పెంపక కేంద్రాలు
- లో సముద్రపు మత్స్య కారుల కొ ఆపరేటివ్ సొసైటి లలో సముఉహక పెంపక ఆవశ్యకత
- అన్ని జలాలలో గల అన్ని జల రాశులకు జియో టాగింగ్ మరియు ఐ.సి.టి సేవల కల్పన