ముఖ్య ప్రణాళిక ఆధికారి
ముఖ్య ప్రణాళిక ఆధికారి
ఎ). ముఖచిత్రము
శాఖ యొక్క పాత్ర మరియు కార్యాచరణ :
జిల్లా ముఖ్య ప్రణాళిక ఆధికారి భారత ప్రభుత్వము /రాస్ఖ్ర ప్రభుత్వముచే రూపొందించబడిన వివిధ రంగాల యొక్క గణాంకాల సేకరణ, సంగ్రహణ మరియు విశ్లేషణలొ పాల్గోనును. ఈ గణాంకాలను ప్రజల సంక్షేమం కొరకు వివిధ పధకాలు మరియు ప్రణాళికలు సూత్రీకరించుటలో ప్రభుత్వమునకు సహాయపడును.
బి ). పధకాలు/కార్యకలాపాలు /కార్యప్రణాళిక :
వ్యవసాయము మరియు కాలానుగుణ పరిస్థితులు :
- వ్యవసాయము :
- వర్షపాతం : మండలానికి ఒకటి చొప్పున 43+3 నూతనముగా ఏర్పడిన పట్టణ మండలాలలో 43 పాత మండలాలకు రెవిన్యూ వర్షామాపక కేంద్రాలు కలవు. ప్రభుత్వము ఉత్తర్వులు ననుసరించి గ్రామీణ మరియు పట్టణ రెవిన్యూ కార్యాలయములో గల 43 రెవిన్యూ వర్శమాపక కేంద్రాల నుండి ప్రతీ దిన /వారపు /నెలవారీ వర్షపాత గణాంకాలను సేకరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరియు వాతావరణ కేంద్రాము, హైదరాబాదు ( ఎంచుకున్న కేంద్రాలకు ) నకు పంపబడును .జూన్ 2014 నుండి ఆధికారి ప్రయోజనము కొరకు 61 ఎ.డబ్ల్యు .ఎస్. మరియు 167 ఎ.ఆర్.జి. వర్షమాపక కేంద్రాలను అన్ని జిల్లాల తహసిల్దార్లుకు సమీకృత వర్షపాత నమోదును తెలియు జేయుటకు స్థాపింపబడినవి. apsdps.ap.gov.in కు లాగిన్ అయినచో ఈ ఇంటిగ్రేటెడ్ వర్షపాతము యొక్క వివరములు తెలుసుకొనవచ్చును.
(ii) ఋతువు మరియు పంట పరిస్థితి నివేదిక: వర్షపాతము , ప్రతీ వారపు/నెలవారీ ఋతువు మరియు పంట పరిస్థితి నివేదికను, పంటల వారీగా నాటిన వివరములను సేకరించి రాష్ట్ర ప్రభుత్వమునకు పంపించబడును.
(iii) వ్యవసాయ గణన: ఖరిఫ్ సీజన్/రబీ సీజన్ లలో సాగునీటి సదుపాయము కలిగిన మరియు సాగునీటి సదుపాయము లేని వివిధ పంటల తుది గణాంకాలను ప్రతి రెవిన్యూ గ్రామము నుండి సేకరించి, మండల, డివిజనల్ మరియు జిల్లా సంగ్రహ పట్టికలు తయారు చేయబడును. ప్రతీ సంవత్సరము ఈ రెండు సీజనలకు సంబంధించిన మండలాల వారిగా స౦క్షిప్తము చేయబడిన జిల్లా సంగ్రహ పట్టికను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వమునకు సమర్పి౦చ బడును.
(iv) ప్రధాన మంత్రి ఫసల్ భీమ యోజన (PMFBY): ప్రధానమైన వరి పంటకు విశాఖపట్నం జిల్లాలో 2016 ఖరిఫ్ నుండి ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన/ప్రధానమంత్రి పంట భీమా పధకం అమలులో ఉంది. గ్రామం యూనిట్ గా ఈ పంట భీమ పధకం అమలవుతుంది.
- ఈ గ్రామా భీమా పథకములో కనీసము 100 హెక్టార్లు ప్రధానమైన పంట ప్రాంతము కలిగిన గ్రామము ఒక యూనిట్ గా పరిగణింపబడును.
- గ్రామములో ఎంచుకున్న పంట ప్రాంతము 100 హెక్టార్ల కన్నా తక్కువగా నున్నచో ప్రక్కనున్న గ్రామాలను ఈ భీమా విభాగపు ఏర్పాటుకు సమీకరించ వచ్చును.
- అమలు చేయవలసిన పంట కోత ప్రయోగాలూ
గ్రామం యూనిట్ గా అమలు చేస్తే ………. 4 ప్రయోగాలు
గ్రామాలు యూనిట్ గా అమలు చేస్తే ………. 4 ప్రయోగాలు
5 గ్రామాలు కన్నా ఎక్కువ/మండలం యూనిట్ గా అమలు చేస్తే ………. 10 ప్రయోగాలు
ఒకటి కన్నా ఎక్కువ మండలాలలో యూనిట్ గా అమలు చేస్తే ………. 16 ప్రయోగాలు చేయాలి.
భారత ప్రభుత్వము 2016 ఖరిఫ్ సీజన్ నుండి ప్రధాన మంత్రి ఫసల్ భీమ యోజన పదకమును ప్రారంభించింది. ఈ పధకమును రాష్ట్ర౦ లోని అన్ని జిల్లాలలో అమలు చేయుటకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది.
ప్రమాద భీమ మరియు మినహాయింపులు:
- నాట్లు నిపుదల: (నోటిపైడ్: ప్రాంతము ఆధారముగా): ప్రతికూల వాతావరణ పరిస్తితులు ఎదురైనప్పుడు నొటిపైడ్ ప్రాంతములో నున్న భీమా రైతులు భీమ చేసిన మొత్తములో నుండి 25% వరకు నష్ట పరిహారం పొందుటకు అర్హులు.
- స్టాండింగ్ పంట (విత్తులు నుండి కోయుట వరకు): నిరోధించలేని ప్రమాదాలు-కరువు, పొడి వాతావరణము, వరదలు, తెగ్గుళ్ళు మరియు వ్యాధులు , కొండచరియలు విరిగిపడుట, అగ్ని ప్రమాదాలు, తుఫాన్లు, వడగండ్ల వానలు, టైపూన్లు, హరికేన్లు, సుడి గాలులు మొదలైన దిగుబడి నష్టములు వాటిల్లినపుడు సమగ్ర ప్రమాద భీమ ఇవ్వబడును.
- కోసిన పంట ఆరుట కొరకు పొలములో ఉన్నపుడు, ఆకాల వర్షములు, తూఫాన్లు వంటి నిర్దిష్ట అపాయములు సంభవించినప్పుడు, కోత కాలము నుండి 14 రోజులలో భీమా అందించబడును.
రాష్ట్రములో భీమా అమలు చేసే సంస్థలు: వ్యవసాయ భీమా కార్పోరేషన్, 10 ఎంపిక కాబడిన ప్రైవేట్ భీమా సంస్థలు.
ప్రధానమంత్రి భీమా పతాకము కేంద్ర జిల్లాలో ఖరీఫ్ 2౦19-2౦ లో గుర్తించబడిన పంటలు :
1) వరి (గ్రామ భీమా విభాగము); 2) మొక్కజొన్; ౩) రాగి; 4) సజ్జలు; 5) మినుములు; 6) వేరుశనగ; 7) కందులు; 8) చెరుకు (మొక్క మరియు కార్సి).
ప్రధాన మంత్రి ఫసల్ భీమా పధకము క్రింద జిల్లలో రబీ 2019-20 సీజన్ లో గుర్తించబడిన పంటలు:
- వరి (గ్రామా భీమా విభాగము); 2) మినుములు; ౩) పెసలు.
వ్యవసాయ గణాంకాలలో ఉత్పత్తి అనునది ఒక ముఖ్యమైన అనుబంధ ప్రమాణము. దీనికి ప్రాంతము మరియు దిగుబడి అవసరము. ఇతర చరరాశుల కన్నా దిగుబడి అతి సున్నితమైనది.
ఉత్పాదకతను అతి చిన్న ప్రమాణాలైన డెకా గ్రామములలో సరితూచి, ఫోరం-II లో ఫలితాలను నమోదు చేయవలెను.
- v) పంట అంచనా సర్వేలు : వివిధ పంటలు ఉత్పత్తి సమాచారమును పొందుటకు ముఖ్యమైన ఆహార మరియు ఆహారేతర పంటలకు పంట కోత ప్రయోగాలు నిర్వహించి ఎకరానికి వచ్చు దిగుబడిని క్షేత్ర ప్రయోగాల నివేదికల ద్వారా పొందవచ్చును ఈ విధముగా సేకరించిన దిగుబడి బట్టి భీమా చేయబడిన పంటలు యొక్క మండల సగటు దిగుబడిని లెక్కించవచ్చు . ఈ దిగుబడి సమాచారమును ఆధారముగా చేసుకొని పంట భీమా చెల్లింపులు డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ చే ఖరారు చేయబడును. పంట కోతకు వచ్చినప్పుడు పంట కోత ప్రయోగాలు ముఖ్య ప్రణాళిక అధీకారి ఎన్ .ఎస్. ఎస్. ఓ., అగ్రికల్చర్ మరియు జనరల్ ఇన్సూరెన్స్ వారి సిబ్బందిచే పర్యవేక్షించబడును.
- vi) వ్యవసాయ గణాoకాలను సకాలంలో నివేదించుట : టి. ఆర్. ఎ. ఎస్. కార్డు ల ద్వారా ప్రతి సంవత్సరము వివిధ పంటల గణాoకాలు సేకరించుటకు మొత్తము రెవిన్యూ గ్రామాలలో 20% నమూనా గ్రామాలు ఎంపిక చేయబడును. ( కార్డు నెం. 1 నుండి 4 వరకు ) పేజి మొత్తం అడంగలు మరియు ప్రాంతము యొక్క గణనను నమూన తనిఖి చేయటకు 1.0 మరియు 1.1 షెడ్యూల్లు సేకరించబడును. పైన సేకరించిన సమాచారమును ఆధారముగా చేసుకొని ప్రభుత్వము ముందుగానే పంట ప్రాంతపు గణాంకాలను అంచనా వేయగలదు.
II ధరలు :
నిత్యావసర వస్తువుల ధరలు : ప్రతిదినము 4 డివిజనల్ ప్రధాన కేంద్రాల యొక్క సంబంధిత ఎ. ఎస్ .ఓ ద్వారా ఆరు నిత్యావసర వస్తువుల రోజువారీ ధరలు సేకరించబడి, ఆన్ లైన్ ద్వారా డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విజయవాడకు అందజేయబడును.
ప్రతి వారాంతపు శుక్రవారము డివిజనల్ ప్రధాన కేంద్రాల యొక్క సంబంధిత డివిజినల్ ఉపగణాంక అధికారులచే 21 నిత్యావసరాల వస్తువుల వారపు ధరలు సేకరించబడి ఆన్ లైన్ ద్వారా డైరక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటస్టిక్స్ విజయవాడకు అందజేయుబడును.
వినియోగదారుడి ధర పట్టిక (IW)/ వినుయోగ ధరల సూచి: ఎంపిక చేయబడిన పారిశ్రామిక కేంద్రాలైన చిట్టివలస (స్టేట్ సీరీస్) నుండి వారపు నెలవారీ వినియోగ ధరల సూచిని సేకరించి డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విజయవాడ వారికి నేరుగా నివేదించబడును మరియు వేరే 2 కేంద్రములు అయిన గాజువాక మరియు విశాఖపట్నం అర్బన్ (పూర్ణామార్కెట్) నుండి కూడా సేకరించి సంబంధిత షెడ్యూల్ లను ప్రతి వారాంతపు/ నెలకు సిమ్లా పంపబడుచున్నది. నూతన సి. పి. ఐ. డబ్ల్యూ. సిరీస్ క్రింద ఎంపికైన 2 కేంద్రములు అయిన గాజువాక మరియు విశాఖపట్నం అర్బన్ (పూర్ణామార్కెట్) నుండి కూడా సేకరించి సంబంధిత షెడ్యూల్ లను ప్రతి వారాంతపు/ నెలకు చెన్నై, చండీఘర్ పంపబడుచున్నది.
వ్యవసాయ మరియు వ్యవసాయేతర కార్మికుల రోజువారి వేతనాలు : 3 ( పెనుగొల్లు, వికమతము, మరియు చింతపల్లి) నుండి వ్యవసాయ మరియు వ్యవసాయేతర కార్మికుల రోజువారి వేతనాలు సేకరించబడుచున్నవి. ఈ వివరముల ద్వారా డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విజయవాడకు అందజీయుబడును.
పశుసంపద ధరలు : నక్కపల్లి నుండి పశువులు, హనుమంతవాక జంక్షన్ (విశాఖపట్నం రూరల్) నుండి లైవ్ స్టాక్ ప్రోడక్ట్స్ మరియు పెందుర్తి మండలం సరిపల్లి నుండి కో ళ్ళు, కోళ్ళ దాణా వివరములు సేకరింఛి ద్వారా డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విజయవాడకు అందజీయుబడును.
వ్యవసాయ పంట ధరలు : పంట యొక్క ఉత్పత్తి విలువను విశ్లేషించుటకు కోత దశలో నున్న ముఖ్యమైన పంటల ద్వారా రైతు పొందు అసలు రెట్లు రద్దీ మార్కెట్ సమయములో సేకరించబడును.
III. ప్రాంతీయ ఖాతాలు :
ప్రతీ సంవత్సరము పెట్టుబడులు మరియు GDP/MDP అంచనా వేయుటకు స్థానిక సంస్థలైన GVMC, VMRDA గ్రామపంచాయతీలు, మండల ప్రజాపరిషత్ లు , జిల్లాపరిషత్ లు, మున్సిపాలిటీలు నుండి వార్షిక ఖాతాలు సేకరింపబడి ఆన్ లైన్ లో నమోదు చేయుబడుచున్నవి.
- గణాంకాల చేతి పుస్తకము తయారీ:
పరిశోధకులకు, ప్రణాళిక నిపుణులకు మరియు ప్రజలకు ఉపయోగపడుటకు ప్రతి సంవత్సరం జిల్లాలో గల అన్ని ప్రధాన విభాగముల యొక్క గణాంకాల సమాచారము మరియు వారి విజయాలతో కూడిన వివరములు చిన్న పుస్తకము రూపములో ప్రచురణ చేయబడుచున్నవి. 2018 సంవత్సరము కొత్త గణాంకాల చేతి పుస్తకము తయారీ లో వున్నది .
- సామాజిక ఆర్ధిక సర్వే :
కుటుంబం వారీగా భూమి మరియు పశుగణన వివరములు, వ్యవసాయ కుటుంబములు స్థితిగతులు మరియు రుణ మరియు పెట్టుబడులు మొదలగు అంశాలను వివరించు 77 వ సామజిక అర్దిక సర్వే జనవరి 2019 నుండి డిసంబరు 2019 వరకు నిర్వహించబడును.
- గణనలు మరియు సర్వేలు :
- భూమిపై యాజమాన్య జనాభా గణన : ప్రతి గ్రామములో ప్రతి 5 సంవత్సరములకు ఒకసారి యాజమాన్య పరిమాణము, కౌలు యాజమాన్య నీటిపారుదల మొదలగు అంశాలలో మార్పులను అంచనావేయుటకు భూమిపై యాజమాన్య జనాభా గణన నిర్వహించబడును. ఇటివల 2015-16 సం. సర్వే నిర్వహించబడినది. జిల్లా నివేదిక డైరేక్టరేట్ అఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ , విజయవాడ కు సమర్పిచబడినది.
- చిన్న నీటిపారుదల గణన : 2013-14 సం.లో 5 వ చిన్న నీటిపారుదల గణన చేయబడినది.
భూగర్బ నీటి పధకాలు సంఖ్య | ఉపరితల నీటి పధకాలు సంఖ్య | మొత్తము నీటిపారుదల పధకాలు |
31801 | 5893 | 37694 |
- ఆర్ధిక గణన : వ్యాపార సంస్థ వృద్ధిని విశ్లేషించుటకు మరియు వాటికి మౌళిక సదుపాయములు కల్పించుటకు 5 సంవత్సరములకు ఒక సారి వ్యాపార సంస్థ గణన జరుగును. ఇటీవల 2012 సం ఆర్ధిక గణన నిర్వహించబడినది .6 వ ఆర్ధిక గణన లొ జిల్లాలో 3,73,622 వ్యాపార సంస్థ సర్వే చేయబడినవి, అందులో 2,37,522 గ్రామీణ ప్రాంతమునకు మరియు 1,36,100 పట్టణ ప్రాంతమునకు సంబంధించినవి.
- పరిశ్రమల వార్షిక సర్వే (ASI): పరిశ్రమల వార్షిక సర్వే 2002-03 సం. ప్రారంభించబడినది. ప్రతి సంవత్సరము పారిశ్రామిక రంగము నుండి దేశీయ ఉత్పత్తి పెట్టుబడుల ప్రణాళికా కొరకు ఎంపిక చేయబడిన పరిశ్రమల పారిశ్రామిక ఉత్పత్తి మరియు జిల్లా స్థూల నిష్పత్తి కొరకు ఈ పరిశ్రమల వార్షిక సర్వేనిర్వహించబడును. 2017-18 వ సంవత్సరములో 119 పరిశ్రమలు ఎంపిక కాబడినవి.
- పారిశ్రామిక ఉత్పత్తి : జిల్లలో I.I.P ద్వారా 43 పరిశ్రములు ఎంపిక చేయబడినవి. ప్రతి నెలకి పరిశ్రమల ఉత్పత్తి వివరములను సేకరించి రాష్ట్ర పారిశ్రామిక వృద్ది రేటు లెక్కింపు కొరకు డైరేక్టరేట్ అఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ , విజయవాడ కు సమర్పిచబడినది.
విశాఖ జిల్లాలో ప్రస్తుత ధర :
అంశం | 2014-15 | 2015-16 | 2016-17 | 2017-18 |
స్తూల జిల్లా దేశీయ ఉత్పత్తి GDDP రూ. కొట్లలో | 61273 | 68952 | 78444 | 89590 |
తలసరి ఆదాయం (పి.సి.ఐ(NDDP) – రూ. కొట్లలో | 122487 | 137589 | 156203 | 178166 |
సంప్రదించావాల్సిన వారి వివరములు:
S.No | Designation | mobile No. | Office Phone No. | Email.Address |
1 | సంయుక్త సంచాలకులు మరియు ముఖ్య ప్రణాళిక అధికారి | 9849901475 | 0891-2706169 | cpovsp@gmail.com |
2 | PIO మరియు ఉప సంచాలకులు | 9989502365 | 0891-2706169 | cpovsp@gmail.com |
3 | APIO మరియు గణాంకాధికారి | 8886703888 | 0891-2706169 | cpovsp@gmail.com |
IMPORTANT LINKS:
Details of State Head Office:
Director,
Directorate Of Economic & Statistics Gollapudi,
Vijayawada.
Cell : 9849908540
Office No. 08662410312
Email address : desgollapudi@gmail.com