ముగించు

సి ఇ ఓ – జిల్లా పరిషద్

ముఖ్య కార్యనిర్వహణాధికారి – జిల్లా పరిషత్

జిల్లా స్థాయిలో పంచాయితీ రాజ్ సంస్థలు జిల్లా పరిషత్లు

భారత రాజ్యాంగ 73 వ నిబంధనలో స్థానిక సంస్థలను క్రింద చూపిన విధంగా తెలియజేసినారు.

  1. జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్
  2. మండల స్థాయిలో మండల పరిషత్
  3.  గ్రామ స్థాయిలో పంచాయితీలు .

జిల్లా స్థాయిలో జిల్లా ప్రజా పరిషత్ 3 శ్రేణిలలో  ఉండును. ఇది జిల్లా ప్రాదేశిక నియోజక వర్గ సభ్యులు (జడ్.పి.టి.సి.) ల చేఎన్నుకోబడిన సంస్థ. అధ్యక్షులు మండల పరిషత్ వారుకూడా జిల్లా ప్రజా పరిషత్ సమావేసములకు ప్రాతినిధ్యం వహిస్తారు. పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు మరియు శాసన మండలి సభ్యులు అందరూ జిల్లా ప్రజాపరిషత్ లలో సభ్యులుగా ఉంటారు.

అధ్యక్షులు, జిల్లా ప్రజాపరిషత్                              :           శ్రీమతి లాలం భవాని భాస్కర్

ముఖ్య కార్య నిర్వహణాధికారి                                :         శ్రీ ఆర్.జయప్రకాశ్ నారాయణ్

ముఖ్య కార్య నిర్వహణాధికారి

జిల్లా ప్రజా పరిషత్తు, విశాఖపట్నం

మండలాల సంఖ్య                                             :      39

జిల్లా ప్రాదేశిక నియోజక వర్గ సభ్యులు (జడ్.పి.టి.సి)      :      39

జిల్లా పరిషత్ కొ ఆప్షన్ సభ్యులు                              :      02

మండల పరిషత్ అధ్యక్షులు                                   :      39

మండల ప్రాదేశిక నియోజక వర్గ సభ్యులు               :       656

ఖాళిగా ఉన్న మండల ప్రాదేశిక నియోజక వర్గాలు    :      11

గ్రామ పంచాయితీల సంఖ్య                                     :     925

జిల్లా పరిషత్ కు ముఖ్య పరిపాలకుడిగా ముఖ్య కార్యనిర్వహణాధికారి వారు వ్యవహరిస్తారు. డివిజనల్ / మండల స్థాయి అధికారుల ద్వారా డివిజనల్ / మండల స్థాయిలో జరుగు అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షస్తారు.

గ్రామీణ ప్రజలకు అతి ముఖ్యమైన సేవలు మరియు సదుపాయాలూ కల్పించుట అనేది జిల్లా ప్రజాపరిషత్ విధులలో అతి ముఖ్యమైనది. అభివృద్ధి ప్రణాలికలు తయారు చేయుట మరియు అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలో చేపట్టుట వీరి విధి.

జిల్లా ప్రజాపరిషత్, విశాఖపట్నం వారి వెబ్ సైట్ : www.apvsp.org