ఆర్ధిక వనరులు
వ్యవసాయం : జిల్లాలో సుమారు 70%కుటుంబములు వ్యవసాయము పై ఆధారపడి జీవిస్తున్నాయి . విశాఖపట్నం పారిశ్రామికముగా అభివృద్ధి చెందినప్పటికీ గ్రామీణ ప్రాంతము ఇంకను వెనుకబాటుతనంతోనే కొనసాగుచున్నది. ఇక్కడ ప్రజలకు వరి ప్రదానాహారము. రాగి, జొన్న, బార్లి కూడా పండించేదరు. చేరకు, వేరుసెనగ, నువ్వులు,మిరప మరియు నైజరు మొదలగు ప్రధాన వాణిజ్య పంటలను పండిస్తారు. ఇక్కడ ఎటువంటి భారీ వ్యవసాయాధారిత ప్రాజెక్టులు లేనందున ఇచ్చట వ్యవసాయ భూమిలో కేవలం 36 % మాత్రమె మధ్య మరియు చిన్నతరహా వ్యవసాయాధారిత ప్రాజెక్టు క్రింద సాగు చేయుచున్నారు. మిగిలిన భూమి వర్షాధారము కావున ఋతుపవనాల ఆధారముగా ఇచ్చట ప్రజలు వ్యవసాయము చేయుట జరుగుచున్నది.
ఇక్కడ పంట దిగుబడి తక్కువ.
పశుసంవర్ధకము
వ్యవసాయమునకు తోడు పశు సంవర్ధకము ఇక్కడ ప్రజలకు ముఖ్య ఆర్ధిక వనరుగా ఉన్నది. వ్యవసాయమునకు ముఖ్య వనరుగా ఉపయోగపడుచున్న పశువులు (ఎద్దులు, దున్నలు మొ.నవి) తదుపరి గ్రామీణ కుటుంబాలకు పాడి పశువులు, గొర్రె మరియు మేకల పెంపకము మంచి ఆర్ధిక వనరుగా ఉన్నది. చాల కుటుంబాలు, విశాఖ డైరి లేక ప్రాంతీయ వాణిజ్య సముదాయములో పాలు అమ్మకం ద్వారా కొంత ఆడాయమును పొందుతారు. 2012 గణాంకాల ప్రకారము జిల్లాలో గల 14.48 లక్షల పసువులలో , 2.01 లక్షలు వ్యవసాయము చేయుటకు ఉపయోగిస్తారు, 3.28 లక్షలు పాడి జంతువులు ( ఆవులు / గేదెలు) 5.76 లక్షలు గొర్రెలు & మేకలు ఇక్కడ ప్రజల జీవనోపాధికి ఇతోదికముగా సహాయకారిగా ఉంటున్నాయి.
చేపల పంపకం
11 మండలములలో గల 132 కి.మీ నిడివి గల సముద్ర తిర ప్రాంతాలలో గల ఆవాస ప్రాంతాలు మరియు 59 మత్స్య గ్రామాల్లో నివసించు ప్రజలకు చేపల వేట ముఖ్య ఆదాయవనరుగా రాణించుచున్నది. సముద్రపు చేపల వేట, తాండవ, రైవాడ జలాశయాలలో చేపల వేట, జిల్లాలో గల చెరువులు మరియు సరస్సులలో చేపల పెంపకం సుమారు 13 వేల మత్స్యకార కుటుంబాలకు ముఖ్య జీవనోపాధి. 2015–2016 లో 1,20,894.27 లక్షల రూపాయల విలువ చేయు 1,18,862 టన్నుల చేపల ఉత్పత్తి చేసిరి.
ఖనిజాలు :
జిల్లాలో గిరిజన ప్రాంతములో బాక్సైట్ నిక్షేపాలు (రాక్ ఫాస్ఫేట్ ) కేలిసైట్, సున్నపురాయి నిక్షిప్తమై ఉన్నవి. జి.కే.వీధీ మండలములో గల బాక్సైట్ నిక్షేపాలు సప్పర్ల, జర్రెల మరియు గూడెం లో ఉన్న నిక్షేపాలు భారత దేశంలోని అతి పెద్ద నిక్షేపము. అరకు ప్రాంతములో బాక్సైట్ నిక్షేపాలు, గాలికొండ, కాటికి, చిట్టెంగొంది లో కూడా ఉన్నవని కనుగొనిరి. అదే విధంగా గుర్తేడు లో గల కాటమరాజు కొండనందు కుడా బాక్సైట్ నిక్షేపాలు ఉన్నట్లు కనుగొన్నారు. అనంతగిరి మండలములో గల కాశిపట్నం గ్రామములో ఫాస్పేట్ నిక్షేపాలు లభ్యమగుచున్నవి. బోర్రా గుహలు నుండి అరకు వెలి వరకు మరియు అనంతగిరి మండలములో గల వలాసి గ్రామము సరిహద్దులలో భారీ స్థాయిలో సున్నపు రాయి మరియు కేలిసైట్ నిక్షేపాలు కలిగి ఉన్నవి. విద్యుత్ మరియు ఎలక్ట్రానిక్ పరిశ్రమలకు ఉపయోగపడు రుబి మైకా జిల్లాలో మరో ముఖ్యమైన ఖనిజ వనరుగా లభ్యమగుచున్నది. ఇది పోలి గ్రాఫైట్ రూపములో లభ్యమై బొర్రా మార్గములో నిక్షిప్తమై ఉన్నది.
భీమునిపట్నం, పద్మనాభం, దేవరాపల్లి, కే.కోటపాడు మరియు అనంతగిరి మండలాలలో క్వార్ట్జ్ ఖనిజము లభ్యమగుచున్నది. అనంతగిరి మండలములో గల కాశిపట్నం లో వేర్మిక్యులేట్ ముడి ఖనిజము లభ్యమగుచున్నది. అరకు మండలములో గల మాలివలస గ్రామములో బంకమన్ను గనులు కలవని కనుగొన్నారు.
ఇక్కడ సున్నపురాయి కెమికల్ గ్రేడ్ లైమ్ తయారికి ఉపయోగపడు సున్నపు రాయి జిల్లాలో ఇతోదికముగా లభ్యమగుచున్నది. ఎరుపు మరియు పసుపు వర్ణములో గల జేగురుమన్ను నిక్షేపాలు అరకు మరియు అనంతగిరి మండలములలో లభ్యమగుచున్నవని కనుగొనిరి.
పరిశ్రమలు :
విశాఖపట్నం నగర ప్రాంతములో భారి పరిశ్రమలు హిందుస్తాన్ షిప్ యార్డ్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్, కోరమాండల్ పెర్తిలైజర్స్, భారత హెవి ప్లేట్స్ అండ్ వెసల్స్, ఎల్.జి.పాలిమర్స్ లిమిటెడ్ మరియు భారి విశాఖ ఉక్కు కర్మాగారము మరియు వాటి అనుబంధ పరిశ్రముల ఏర్పాటుతో పారిశ్రామిక అభివృద్ధి ఇతోధికంగా జరిగినది.
విశాఖ ఉక్కు కర్మాగారము లో అతిపెద్ద షేర్ క్యాపిటల్ (ముఖ విలువ) 7 4 6 6 కోట్ల రూ.లు విలువ కలిగిన 2.8 మిలియన్ టన్నుల ఇనుము మరియు 3 మిలియన్ టన్నుల దుక్క ఇనుము మరియు 8.3 లక్షల టన్నుల ముడి సరకు ఉత్పత్తి అగుచున్నది. ఈ సంస్థలో రమారమి 34 వేల మంది ప్రజలు ప్రత్యక్షముగా లేదా పరోక్షంగా ఉపాధి పొందుచున్నారు. ఈ సంస్థ 33,000 మందికి ఉపాధి కల్పించినది. విశాఖపట్నం జిల్లాలో వ్యవసాయాధారిత పరిశ్రమలైన చక్కర పరిశ్రమ, జనపనార పరిశ్రమ మరియు బియ్యపు మిల్లుల తో పాటు ఇటుక మరియు పెంకు కర్మాగారాలు దేశములో ప్రసిద్ధిగాంచినవి. జిల్లాలో 1664 పరిశ్రమలు గుర్తింపు పొందినవి. వీటిలో 1,50,386 మంది 2015–16 సం.లో పనిచేసిరి.
ప్రత్యెక ఆర్ధిక మండలి :
విశాఖ జిల్లా నందలి రాంబిల్లి మరియు అచ్యుతాపురం మండలాల్లో 9 2 0 0 . 2 7 ఎకరాల స్థల సేకరణ గావించి అంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారు విశాఖ జిల్లానందు అంధ్రప్రదేశ్ ప్రత్యెక ఆర్ధిక మండలిని ఏర్పాటు చేసిరి. ఇప్పటి వరకు 6 9 2 2 . 2 9 ఎకరాల ప్రైవేట్ భూమి సేకరణ చేసి, 2 2 7 7 . 9 8 ఎకరాల ప్రభుత్వ భూమిని వాటికి కేటాయించిరి. 2 7 గ్రామములలో నివసిస్తున్న 3 1 2 5 కుటుంబాలు నిర్వాసితులు కాబడినారు. వీటిలో దుప్పిటూరు గ్రామము కూడా ఉన్నది. ఈ గ్రామాన్ని అచ్యుతాపురం మండలము నందలి దిబ్బపాలెం లో 4 1 0 0 ప్లాట్లను కేటాయించి నిర్వాసితులకు ఆశ్రయము కల్పించదమైనది. రోడ్లు, మురుగు కాల్వలు, విద్యుత్, మంచి నీటి సదుపాయము మరియు పాఠశాల భవన నిర్మాణాలు మొదలగు మౌలిక వసతుల కల్పన జరుగుచున్నది.
విద్యుత్ శక్తి :
జిల్లాలో గల పరిశ్రమలు 373.58 మిలియన్ కిలోవాట్ల విద్యుత్ ను, వ్యవసాయానికి 176.33 మిలియన్ కిలోవాట్ల విద్యుత్ ను వినియోగిస్తున్నారు. జిల్లాలో గల 5030 గ్రామాలతో పాటు అన్ని ఆవాస ప్రాంతాలు విద్యుతికరణ గావించబదినవి. వీటిలో 2 0 1 5 – 1 6 సం.లో వినియోగించిన విద్యుత్తులో సౌర శక్తి కూడా భాగమై ఉన్నది.
రవాణా మరియు ప్రచారసాధనాలు
జిల్లాలో .గల 7 9 2 6 . 0 8 కి.మీ నిడివి గల రోడ్లలో 1 7 . 4 5 కీ.మీ నిడివిగల రోడ్డు జాతీయ రహదారి పరిధిలోను, 3 3 5 . 7 8 కి.మీ రాష్ట్ర రహదారుల పరిధిలో మిగిలిన రోడ్లు జిల్లా పరిషత్, మండల పరిషత్ మరియు రోడ్లు భవనాల శాఖ పరిధిలో నిర్వహింపబడుచున్నవి. జిల్లాలో గల 1 0 రైల్వే స్టేషన్ లతో పాటు 82.13 కి.మీ పొడవైన బ్రాడ్ గేజ్ రైల్వే మార్గము కలదు. 2015 – 16 సం.వరకు 11,56,014 వాహనములు రిజిస్టర్ అయినట్లు వాటిలో 5,44,754 మోటారు వాహనములు మరియు 5,80,594 మోటారు సైకిళ్ళు కలవు. వివిధ రకాలకు చెందిన 10,42,458 మోటారు వాహనములు ప్రస్తుతము రోడ్లపై తిరుగుచున్నవి. జిల్లాలో 6 7 4 తపాల కార్యాలయములు మరియు 9 4 8 6 0 టేలిపోన్ సదుపాయము కలిగిన 110 టెలిఫోన్ ఎక్చేంజ్ లు కలవు. 1 1 5 5 కమ్యూనిటి రేడియో సెట్లు మరియు 8 9 టెలివిజన్ సెట్లు జిల్లాలో పనిచేయుసున్నవి.
ముఖ్య ఆర్ధిక వనరు
2015 – 16 సం.లో ముఖ్యమైన ఆర్ధిక రాబడి రాష్ట్రమునుండి 239341.97 లక్షలు మరియు 1,43,346 లక్షలు కేంద్ర ప్రభుత్వము నుండి వచ్సియున్నవి.
బ్యాంకింగ్ వ్యవస్థ
సహకార బ్యాంకులతో కలిపి 707 బ్యాంక్ శాఖలు జిల్లాలో గల ప్రజల యొక్క ఆర్ధిక లావాదేవీలు చూచుచున్నవి. జిల్లా నందలి 43,582 స్వయం సహాయ సంఘాలు బ్యాంకులతో సంధానింపబడి పనిచేయుచున్నవి.
విద్య మరియు వైద్య సదుపాయములు
2015 – 16 సం.లో 3.11 లక్షల విద్యార్థులతో 3,417 ప్రాధమిక పాఠశాలలు, 1.22 లక్షల విద్యార్థులతో 801 ప్రాధమికోన్నత పాఠశాలలు 1.73 లక్షల విద్యార్థులతో 986 ఉన్నత పాఠశాలలు మరియు 1.99 లక్షల విద్యార్థులతో 543 జూనియర్ / డిగ్రి/ వృత్తి విద్యా సంస్థలు కలవు.
అల్లోపతి వైద్య విధానము లో 108 ప్రభుత్వ ఆసుపత్రులు మరియు డిస్పెన్సరిలతో 1036 పడకలు కలవు. వీటిలో 172 మంది వైద్యులు కలరు. భారత వైద్య విధానము (ఆయుర్వేదము, హోమియోపతి, యునాని, ప్రకృతి) లలో 38 ఆసుపత్రులు మరియు డిస్పెన్సరీలు కలవు. వీటిలో 26 మంది వైద్యులు కలరు.