ముగించు

సర్వ శిక్ష అభియాన్

a) ముఖ చిత్రం

ఆరు సంవత్సరాల వయసు నుండి పద్నాలుగేళ్ళ వయసున్న పిల్లలందరికీ ఉచిత నిర్బంద విద్యని ప్రాథమిక హక్కుగా చేస్తూ భారత రాజ్యాంగానికి చేసిన 86వ సవరణ నిర్దేసిన్చినట్లుగా నిర్ణీత కాల పరిధిలో అందరికీ ప్రాథమిక విద్య అందిచతమే లక్ష్యంగా భారత ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమమే సర్వ శిక్షా అభియాన్. మాజీ ప్రధాన మంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పాయ్ ఈ కార్యక్రమానికి ఆద్యులు.

ఓ మధ్యంతర కార్యక్రమముగా 2000-2001 సంవత్సరం నుండి అమలుతున్నప్పటికి ఈ కార్యక్రమపు మొలలు అందరికి ప్రాథమిక విద్యనందించే లక్ష్యమే సాధనగా 1993-94 విద్యా సంవత్సరంలో ప్రాథమిక జిల్లా ప్రాథమిక విద్యా కార్యక్రమం DPEP వాటివని చెప్పవచ్చు.

DPEP కార్యక్రమం దేశంలోని 18 రాష్ట్రాలలోని 272 జిల్లాలలోను ఎన్నో దశల వారీగా విస్తరించింది. ఈ కార్యక్రమానికై అయ్యే ఖర్చులో 85% కేంద్ర ప్రభుత్వం , 15% రాష్ట్ర ప్రభుత్వం పంచుకోన్నాయి. ప్రపంచ ద్రవ్యనిధి (World Bank), DFID, UNICEF వంటి బాహ్య సంస్థలెన్నో కేంద్ర ప్రభుత్వ వాటా కోసం నిధులు సమకూర్చగా సుమారు 5 కోట్ల మంది పిల్లలని ఈ పథకంలోకి చేర్చటానికి 150 కోట్లకి అమెరికన్ డాలర్లు, మించిన ఖర్చు అయినది.

DPEP మొదటి దశలో ఈ కార్యక్రమ ప్రభావం ఎంతమేరకు మందిని దశ రూపకర్తలు అంచనా వేయగా చాల తక్కువ మంది పిల్లలపైనే ఈ కార్యక్రమ స్థూల ప్రభావం అమూఘంగా ఉందని బాలికలపై ఈ కార్యక్రమం ప్రభావం అంతగా కార్యక్రమంపై పెట్టుబడి ఓ అనవసర ఖర్చు ఏమి కాదని ఎందుకంటే ప్రాథమిక విద్యా పాఠశాలల మధ్యంతర కార్యక్రమాలకు కొత్త ఒరవడిని చుట్టినదని నిగ్గుతెల్చారు.

విద్యా హక్కు చట్టం ఏప్రిల్ ఒకటో తేది 2010 నాటి నుండి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ఆమోదం పొందటం వల్ల SSA తన లక్ష్యాలను అమలు చేయటానికి చట్ట పరంగా కావలసినంత వూతం లభించిందని కొందరు విద్యావేత్తలు, విధాన కర్తలు నమ్ముతున్నారు.

ఈ శాఖ పాత్ర మరియు విద్యుక్త ధర్మాలు
అందరికి ప్రాథమిక విద్యనందించే కార్యక్రమమే సర్వ శిక్షా అభియాన్. తమ మానవ సమాజ సామర్ధ్యాలను మెరుగుపర్చుకోనటానికి పిల్లలందరికీ గుణాత్మకమైన విద్యనమ్దిన్చాతమే పనిగా పెట్టుకొని వారికి అవకాశం కల్గిన్చాటానికి చేసే ఓ ప్రయత్నమే ఈ SSA కార్యక్రమం. గుణాత్మకమైన ప్రాథమిక విద్యని దేశవ్యాప్తంగా అందించాలన్న మేధావుల, ప్రజల అభిలాషమ్ ప్రతిస్పందనే ఈ SSA కార్యక్రమం.

SSA కార్యక్రమం ప్రధాన అంశాలు:

1.నిర్ణీత కాల చట్రంతో అందరికీ ప్రాథమిక విద్యనందించటం.
2.అందరికీ మెరుగైన ప్రాథమిక విద్యనందించాలని దేశ వ్యాప్తంగా రగిలిన కాంక్షలకు దనే
ఈ కార్యక్రమం.
3. ప్ర్రాథమిక విద్య ద్వారా సామాజిక న్యాయాన్ని పెంపొందించే ఓ సువర్నవకాశం ఈ కార్యక్రమం.
4. దేశ వ్యాప్తంగా అందరికీ ప్రాథమిక విద్యనందించే రాజకీయ ఇచ్చే వ్యక్తీకరణ ఈ కార్యక్రమం.
5. స్థానిక, రాష్ట్ర , కేంద్ర ప్రభుత్వాల మధ్య భాగస్వామ్యం.
6. ప్రాథమిక విద్యపట్ల తమ సొంత వైఖరిని, లక్ష్యాలను సాధించుకొనటానికి రాష్ట్రాలకు దక్కిన అవకాశం ఈ కార్యక్రమం.
7. క్షేత్రస్థాయి నిర్మాణoలో భాగంగా ప్రాథమిక పాఠశాలల నిర్వహణలో పంచాయత్ రాజ్ సంస్థలను, పాఠశాల నిర్వహణ కమిటీలను గ్రామీణ , నగర మురికివాడల స్థాయి విద్యా కమిటీలను, ఉపాధ్యాయ – తల్లిదండ్రుల సంఘాలను, తల్లి-ఉపాధ్యయునుల సంపనాలని గిరిజన స్వయంపాలక మండళ్ళని సమర్ధవంతంగా భాగస్వాములను చేసే ఓ ప్రయత్నమే ఈ కార్యక్రమo.

లక్ష్యాలు :-

1) 6-14 సం|| వయస్సుగల పిల్లలoదరికీ ఉపయోగకరమైన ప్రాథమిక విద్యనందించటం
2) పాఠశాలల నిర్వాహణలో సమాజ భాగస్వామ్యంతో లింగ, ప్రాoతీయ, సామాజిక అంతరాలను పూడ్చటం.
3) పిల్లలు భౌతికంగా, ఆధ్యాత్మికంగా తమ అంతర్గత శక్తిని పెంపొందించుటకు వారి చుట్టూ ఉన్న పరిసరాలను తెలుసుకోనివ్వటం, పరిసరాలకు అలవాటు పడనివ్వటం.
4) విలువ ఆధారిత విద్యనుపదేశించటం ద్వారా కేవలo తమ వ్యక్తిగత ప్రయోజనాలకన్న పరుల సంక్షేమం కోసం పనిచేసేలా పిల్లలికి అవకాసం కల్గించటం.
5) జీవతం కోసం విద్య అనే భావననికి ప్రాధాన్యమిస్తూ సంతృప్తికరమైన మెరుగైన ప్రాథమిక విద్యనందిoచటంపై దుష్టి కేంద్రీకరించటం.

జిల్లలో అక్షరాస్యత రేటు (2011 జనాభా లెక్కలాదారంగా ):

అన్ని సంఘాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీ
మగ ఆడ మొత్తం మగ ఆడ మొత్తం మగ ఆడ మొత్తం మగ ఆడ మొత్తం
75.47 60.00 67.7 70.87 52.98 61.99 45.98 22.67 34.34 69.7 50.1 60

వనరులు (జనాభా 2011)

అత్యధిక అక్షరాస్యత సాధించిన మండలాలు             :       పెడబయలు (33.2%)

అత్యల్ప అక్షరాస్యత మండలాలు                       :         విశాఖపట్నం (యు) (75%)

జిల్లా గూర్చి క్లుప్తంగా (District at a Glance) :

Sl.No Indicators Number
1 No.of Mandal Resource Centres 43
2 No.of Educational Divisions 3
3 No.of School Complexes / Cluster Resource Centres 260
4 No.of KGBVs 34
5 No.of Muncipalities:2 + No. of Municipal Corporations: 1 3
6 No.of Villages 3294
7 No.of Panchayats 925
8 No.of Mpl. Wards 194
9 No.of Habitations 5607
10 Density of population(as per Sq.Km) (Census 2011) 384
11 Sex Ratio (Census 2011) 1000:1009
12 Growth Rate of Population (Census 2011) 11.89
13 SC Population 291219
14 ST Population 557572
15 Minority Population 113041

సి) పథకాలు / చర్యలు / ప్రణాళికా చర్యలు

అమలు పథకాలు:

1) ఉపాధ్యాయులకు/ బడులకు విద్యా సంబంధమైన సహకారం

2) సమాజ గతసీలత కార్యక్రమాలు

3) బడి బయట విద్యార్ధులకు ప్రత్యామ్నాయ బోధనా ఏర్పాట్లు

4) ప్రత్యేకావసరాలగల పిల్లలకు సమగ్ర విద్యనందించటం

5) ప్రణాలికా విభాగం ఏర్పాటు

6) బడులకు మౌలిక నిర్మాణ వసతులు కల్పించటం

7) బాలికా విద్యనూ అభివృద్ధి చేయటం

చేపట్టిన కార్యకలాపాలు :

  1. బడులకు / ఉపాధ్యాయులకు విద్యావిశాయిక సహకారమందించటం
  2. ప్రాథమికోన్నత పాఠశాలలకుఅభ్యాసన సామగ్రి, గ్రంధాలలో పుస్తకాలు అందించటం
  3. మెరుగైన పర్యవేక్షణ కోసం స్కూల్ సముదాయాలను బలోపేతం చేయటం.
  4. పాఠశాల నిర్వాహణ కంమితీలకు, మండల వనరు కేంద్రాలకు క్లస్టర్ వనరు కేంద్రాలకు వార్షిక గ్రాన్తులను అందజేయటం.

సమాజాన్ని చైతన్య వంతం చేసే కార్యకలాపాలు

బడి బాట , బడి పిలుస్తోంది, మనఊరు – మనబడి, రాజన్న బడిబాట వంటి

  1. పిల్లలను బడులలో చేర్పించే కార్యక్రమాలు నిర్వహించటం
  2. స్కూల్ నిర్వాహణా కమిటీలను బలూపెతం చేసి కమిటీలోని సభ్యులకు జాగృతి కార్యక్రమాల సభలను నిర్వహించటం
  3. ఒకటో తరగతి నుండి 8వ తరగతి వరకు చదివే పిల్లలకు రెండు జతల ఏక రూప దుస్తులను అందిచటం .
  4. విద్యా హక్కు పై మరియు అందరికి విద్యా కార్యక్రమం (SSA) పై కళాజాతరాలు , విద్యా విషయాల పట్ల అవగాహన సదస్సులు ఏర్పాటు చేయటం
  5. ప్రసార మాధ్యమాలలో ప్రచారం
  6. బడి ఋణం తీర్చకుండ వంటి కార్యక్రమాలలో స్కూల్ నిర్వహణలో సామాజిక యాజమాన్యం , సహకారం

బడి బయట పిల్లలకు ప్రత్యామ్నాయ బోధనా సదుపాయములు

  1. బడి మానేసిన పిల్లలని గుర్తించడానికి గాలింపు చర్యలు
  2. స్వల్ప కాలం పాటు బడి మానేసిన పిల్లలకు వసతి గృహీతర ప్రత్యెక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయటం
  3. వలస కార్మికులకు పిల్లలకోసం స్వల్ప కాల వ్యవధి గల వసతి గృహాలు ఏర్పాటు చేయటం
  4. దురావాస ప్రాంతాల పిల్లలను బడికి చేర్చేన్డుకై రవాణా సౌకర్యాలు కల్పించటం

ప్రత్యేకావసరాలు కల్గిన పిల్లలకు ప్రత్యేక విద్య నందించుట

  • ప్రత్యేకవసరాలు కల పిల్లలను గుర్తించటం
  • ఉపయుక్తమైన భోధనోపకరణాలు ఉపయోగించి బోధించే పద్దతుల్లో ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు.
  • అసరమైన పిల్లలకు ఉపకరణాలు, పరికారాలను అందించటం.
  • కావాల్సిన పిల్లలకు ఫిజియోథెరపి శిబిరాలు ఏర్పాటు చేయటం.
  • CwSN కోసం ప్రత్యేక విద్యా కేంద్రాల నిర్వహణ
  • అవసరమైన పిల్లలకు/మాటలు పలకటం సరిగా రాణి పిల్లలకు వాక్ చికిత్స (Speech Therapy) నందించటం.
  • NRSTC లకు హాజరగు పిల్లకు రవాణా సౌకర్యాన్ని కల్పించటం.
  • సాధారణ స్కూళ్ళకు హాజరయ్యే విధ్యార్దులకు కూడా తోడు పంపే సౌకర్యాన్ని కల్పించటం.
  • NGO సంస్థల భాగస్వామ్యంతో చిన్న చిన్న సర్దుబాటు శస్త్ర చికిత్సలవంటివి నిర్వహించటం.

ప్రణాళిక విభాగం:

  1. విధ్యపై ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థ (UDISE) ద్వారా సమాచార సేకరణ.
  2. వార్షిక కార్యాచరణ ప్రణాళిక బడ్జెట్ తయారీ.
  3. ఆదార్ సీడింగ్
  4. కాల్ సెంటర్స్ ఏర్పాటు
  5. విద్యా విజువల్ CD లను అందించటం

పాఠశాలలకు మౌలిక నిర్మాణ వసతుల కల్పన:

  1. అదనపు తరగతి గదుల నిర్మాణం
  2. బాలురు, బాలికలకు వేర్వేరు మరుగుదొడ్లు నిర్మాణం మరియు CWSN మరుగుదొడ్లు నిర్మాణం
  3. మరుగుదొడ్లకు ప్రవాహ నీటి సదుపాయం కల్పించటం
  4. పాఠశాలలకు త్రాగునీటి సదుపాయం కల్పించటం
  5. ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలలకు భారీ మరమ్మత్తులు చేయటం
  6. మరుగుదొడ్ల పరిశుభ్రతకు నిర్వహణ ఖర్చులు చెల్లించుట.
  7. పాఠశాలలకు ప్రహరిగోడల నిర్మాణం.
  8. పాఠశాలలకు సామాగ్రి (ఫర్నిచర్) సమకూర్చుట.

ఆడ పిల్లల కోసం అభివృద్ధి కార్యక్రమాలు

  1. బాల్య వివాహాలు , బాలికా సాధికారత, కెరిఎర్ మార్గదర్శకత్వం, ఆరోగ్యం, పరిశుభ్రమైన వాతావరణం లపై అవగాహన కార్యక్రమాల నిర్వహణ
    2. అనాధలు, తండ్రి గాని, తల్లి గాని ఎవరూ ఒకరు లేని బాలికల కోసం, OSC కోసం బడులు, మరియు కస్తురిబా గాంధీ బాలికా విద్యాలయాల ఏర్పాటు
    3. కౌమార దశలోని బాలికలలో వయస్సుతో వచ్చే మార్పుల అవగాహన కల్గించే జిల్లా స్థాయి ప్రత్యెక కారఎక్రమం ‘బాలికా తెల్సుకో’ అనే మధ్యంతర విధాన కార్యక్రమం నిర్వహించటం.

2019 – 20 విద్యా సంవత్సర కార్యాచరణ ప్రణాళిక

నాణ్యమైన విద్య 2019 -20

పాఠశాలల్లో అమలు జరుగుతున్న బోధనా మరియు అభ్యసన కార్యక్రమాల నాణ్యతను పెంపొందించడానికి తద్వారా విద్యా ప్రమాణాల పెంపుదలకు ఆంధ్ర ప్రదేశ్ సర్వ  శిక్ష అభియాన్ వివిధ  రకాల కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుంది :

ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణి : జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికి ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణి చేయడం జరిగింది

పాఠశాలల మిశ్రమ గ్రాంట్లు : 2019 -20 సంవత్సరముకు గాను రూ.3488 ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలకు పాఠశాల నిర్వహణ మరియు దైనందిక  అవసరములకు గాను 845 .63 లక్షలు మంజూరుకాబడినవి.

పాఠశాల సముదాయ గ్రాంటు: 2019 -20సంవత్సరముకు గాను స్కూల్ కాంప్లెక్స్ ల బలోపేతానికి, పాఠశాలల పని తీరు మదింపునకు, సమీక్షలు నిర్వహించడం కోసం 260 పాఠశాల సముదాయములకు  రూ.54 .60 లక్షలు మంజూరుకాబడినవి.

మండల వనరుల కేంద్రం గ్రాంటు: 2019 -20 సంవత్సరముకు గాను 46 మండల వనరుల కేంద్రములకు  రూ.27 .60 లక్షలు మంజూరుకాబడినవి.

ఆనంద లహరి అభ్యసన (అల) – 198 ప్రాధమిక పాఠశాలల్లో 2019 -20  విద్యా సంవత్సరంనకు గాను అల కార్యక్రమం అమలు చేయబడుతుంది.

ఆనంద వేదిక : 1 నుండి 10 తరగతి వరకు విద్యార్థుల భావోద్వేగ అభ్యాసం కొరకు మరియు సమాజం పై అవగాహన కల్పించడం కోసం అన్ని ప్రభుత్వ పాఠశాలలలో  “ఆనంద వేదిక” అమలు కాబడినది.

బోధనోపకరణల పంపిణి: మండల, డివిజన్ మరియు జిల్లా స్థాయిలలో బోధనోపకరణల మేళ నిర్వహణ కొరకు మరియు విద్యార్థుల అభ్యసనా సామర్ధ్యాన్ని మెరుగు పరచడానికి బోధనోపకరణల పంపిణి చేయడం జరిగింది.

రెమెడీయల్ బోధన: చదువులో శీఘ్ర పురోగతి చూపించలేకపోతున్న విద్యార్థులకు రెమెడీయల్ బోధన కోసం వేసవి శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది.

రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ : ఇందులో భాగంగా స్థానికంగా ఉన్న ప్రాంతాల, పరిశ్రమల, వ్యవసాయ క్షేత్రాల, కర్మాగారాల ను సందర్శించడం ద్వారా సైన్స్ ఎక్గిబిషన్స్, క్విజ్ పోటీలు ద్వారా  వెనుకబడిన విద్యార్థుల్లో విద్యపై ఆసక్తి పెంచేంటందుకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఎంపిక కాబడిన 239  పాఠశాలలకు గణితం మరియు సైన్స్ కిట్స్ ను కూడా అందచేయడం జరుగుతుంది.

స్కూల్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ (SIP ): జిల్లాలో ఉన్న 20 ఉన్నతపాఠశాల్లో గత సంవత్సరం అమలుచేయబడిన ఈ  కార్యక్రమం, ఈ విద్యాసంవత్సరంలో 40 ఉన్నత పాఠశాలలో Dr  రెడ్డి ఫౌండేషన్ వారి సహకారంతో అమలుజరుగుచున్నది

డిజిటల్,వర్చ్యువల్ మరియు స్మార్ట్ తరగతులు :  విద్యార్థులను టెక్నాలజీకి దగ్గరగా తీసుకురావడం మరియు అభ్యాస పద్దతులు మరియు ఫలితాలను మెరుగుపరచడం కొరకు 360 పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ద్వారా, 207 ఉన్నత పాఠశాలల్లో ఎర్నెట్ ద్వారా, 38  ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలల్లో యూనీకోప్స్ ద్వారా  వర్చ్యువల్ తరగతులు మరియు 50 ఉన్నత పాఠశాలల్లో స్మార్ట్ తరగతులు ద్వారా విద్య ను అందించడం జరుగుతుంది .

విందాం – నేర్చుకుందాం: ప్రాధమిక పాఠశాల విద్యార్ధులకు రేడియో ద్వారా విందాం – నేర్చుకుందాం కార్యక్రమం ఉదయం. గం.11.00 నుండి. గం.11.30 ని.ల. వరకు ఈ సంవత్సరంలో అమలుపరచడమైనది.

గణిత మిత్ర : గణిత మిత్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో ఉన్న 255 ప్రాధమికోన్నత పాఠశాలలలో ఉపాధ్యాయులకు గణితం పైన శిక్షణ ఇచ్చి కిట్స్ పంపిణి చేసి గణితంపై పిల్లలో భయాందోళనలు పోగొట్టటం  కోసం  అమలుపరుచబడినది.

గణిత వికాసం (అబాకస్) : 2019-20 సంవత్సరంలో గణిత వికాసం పేరిట 95 ఉన్నత పాఠశాలల్లో అబాకస్ గణిత కార్యక్రమాన్ని అమలు చేయాలని A.P. ప్రభుత్వం నిర్ణయించింది. సమస్య పరిష్కార సామర్ధ్యాలను అభివృద్ధి చేయడంలో మరియు సామర్థ్యాలను లెక్కించడంలో విద్యార్థులకు అబాకస్ మరియు మానసిక సామర్థ్య కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం విద్యార్థుల తార్కిక ఆలోచనా సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

గిరిజన మాతృ భాషలో విద్యా బోధన (మ్లే) : జిల్లాలో గిరిజన ప్రాంతాలలో ఉన్న ప్రాధమిక పాఠశాలలో రెగ్యులర్ సిలబస్ ను కొండ, కువి మరియు ఆదివాసీ ఒరియా బాషలలో బోధించుటకు గాను ఈ సంవత్సరం చర్యలు తీసుకోవడం జరిగింది

శాల సిద్ధి : పాఠశాల ప్రమాణాలు మదింపు మరియు మూల్యాంకనం కొరకు జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలల్లో ఈ కార్యక్రమం అమలు జరపబడింది.

గ్రంధాలయ నిర్వహణ : పాఠశాలలోని విద్యార్థులందరికీ పుస్తకాలు మరియు పఠనం, సమాచారం మరియు సమాచార సాంకేతిక పరిజ్ఞానం”కు సమానమైన ప్రాధాన్యత ఉండేలా చూడటం కొరకు రకరకాల పుస్తకాలను పంపిణి చేయడం జరిగింది.

పూర్వ ప్రాధమిక విద్యను బలోపేతం చేయడం : ఇందుకోసం అంగన్వాడీ కేంద్రాలు మరియు పాఠశాలలు ఒకే ప్రాగణంలో ఉన్న వాటిని ఎంపిక చేసి ఆ కేంద్రాలకు పుస్తకాలు మరియు నిధులు మంజూరు చేయడం ద్వారా బలోపేతం చేయడం జరుగుతుంది.

ప్రేరణ : అభ్యాసకులలో హాజరు రేటు మరియు తరగతి భాగస్వామ్యాన్ని పెంచడం కోసం, గణితం మరియు స్థానిక భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం కోసం శిక్షణ సంస్థాన్ ద్వారా గిరిజన మండలాలు లో ఉన్న అన్ని పాఠశాలల్లో ప్రేరణ కార్యక్రమం అమలు చేయబడుతుంది

ట్విన్నింగ్ అఫ్ స్కూల్స్ (పాఠశాలలను జత చేయడం): వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులు ఒకరినొకరు కలుసుకొని వారి ఆలోచనలు, ఉత్తమ కార్యాచరణాలను పంచుకొని తద్వారా మరింత సమర్ధ వంతంగా పని చేయడం కోసం జిల్లాలో ఉన్న 878   పాఠశాలలను 439 జతలను  ఎంపిక చేయడం జరిగింది.

సాముదాయక గతిశీలతా కార్యక్రమాలు

  1. స్వచ్చ సంకల్పం పై అవగాహన తరగతులు నిర్వహించుటకు ఉద్దేశించిన కార్యక్రమాలు ఇవి
    2. బడులకు మాలిక నిర్మాణ సౌకర్యాలు అందిచుటలో సఫలీక్రుతమైన సాముదాయక భాగస్వామ్యం గురించి ప్రచారం కల్పించటం
    3. మెరుగైన , రుచికరమైన మద్యాహ్న భోజనం, త్రాగునీటి సౌకర్యాలు, ప్రహారి గోడల నిర్మాణం. బడులలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించటం ద్వారా బడిలో చేరి విద్యార్ధుల సంఖ్యని పెంచటం
    4. మెరుగైన గుణాత్మక విద్యనందిoచటానికి మున్సిపల్,మండల పరిషత్తు , జిల్లా పరిషత్, ప్రభుత్వ బడులలో డిజిటల్ తరగతులు సౌకర్యాలు కల్పించటం.
    5. స్వాతంత్ర్యదినోత్సవ సంపూర్ణ స్వాతంత్ర్య దినోత్సవాలనాడు స్టాల్లని ఎపాటు చేయటం.
    6. జాతీయ విద్యాదినోత్సవాన్ని నిర్వహించటం.
    7. ఉత్తమ స్కూల్ నిర్వాహక కమిటీలను ప్రసంసా పత్రాలతో సత్కరించటం.
    8. మురికి వాడలలో సాముదాయక సమావేశాలు నిర్వహించటం.
    9. తీవ్రవాదాన్ని అరికట్టడం కోసం గిరిజన ప్రాంతాల్లో సముదాయ గతసీలత కల్గించే వ్యక్తులను నియమించటం కోసం యోచించటం.
    10. OSC నిర్మూలనకై NGOలు సంబంధిత శాఖలతో సమ్మెలన సభలు నిర్వహించటం.
    11. స్వచ్చభారత్, మరియు స్వచ్చ సంకల్పంలపై స్కూల్ పరిశుభ్రతా కార్యక్రమాలు నిర్వహించినందులకు అవార్డుల పంపిణీ చేయుటకు యోచనలు చేయటం.

బడిబయట విద్యార్దులకు ప్రత్యామ్నాయ బోధనా సౌకర్యాలు

i.నాన్-రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్స్ (ఎన్‌ఆర్‌ఎస్‌టి): ముంచింగ్‌పుట్, పెడబయలు, హుకుంపేట, పాడేరు, జి. మదుగుల, చింతపల్లి, జికెవీధి, కోయూరు, డంబ్రిగుడ, అనంతగరవలిలోని పిల్లల కోసం నాన్-రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్లను తెరవడానికి ప్రణాళిక. & పాఠశాల ప్రాంగణంలో విశాఖపట్నం యు పాఠశాల హెచ్ఎం / స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం పర్యవేక్షణలో మరియు ప్రత్యేక శిక్షణతో 15 నుండి 20 మంది పిల్లలకు ఉపాధ్యాయ వాలంటీర్లను నిమగ్నం చేయడం.

ii.సీజనల్ హాస్టల్స్: వలస వచ్చిన పిల్లల కోసం అక్టోబర్ 2019 నుండి మార్చి 2020 వరకు 16 సీజనల్ హాస్టళ్లను తెరవడానికి ప్రణాళిక. ప్రతి హాస్టల్‌లో 50 మంది పిల్లలు ఉంటారు. మేము 11 మండలాలను గుర్తించాము, ఇక్కడ వలస కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి, అనగా రాంబిల్లి, నాతవరం, కొయ్యూరు, గోలుగోండ, అచ్చూతాపురం మరియు కశింకోట.

iii. రవాణా సౌకర్యం: 570 మంది పిల్లలకు రవాణా సౌకర్యం కల్పించడానికి ప్రణాళిక (గుర్తించిన 12 రిమోట్ మండలాల్లో 74 రిమోట్ నివాస ప్రాంతాలలో గుర్తించబడిన ప్రాథమిక మరియు ఎగువ ప్రైమర్.

ప్రత్యేక అవసరాలు కల్గిన పిల్లలకు ప్రత్యేక విద్య నందించుట:

  • AIMCO, RBSK(NRHM), సాంఘిక సంక్షేమ, వికలాంగ సంక్షేమ శాఖల సమ్మేళనంతో CwSN కోసం పరికరాలు, ఉపకరణాలు అందజేయటానికి శిబిరాలు నిర్వహించుట, శిబిరానికి హాజరయ్యే పిల్లలకు ప్రయాణ భత్యం చెల్లించటం.
  • CwSNలు ఎలాంటి మానిసిక/భౌతిక అడ్డంకులు లేకుండా చదువు కొనసాగింటానికి ఫిజియోథెరపిష్టుల, సైకాలజిష్టుల సేవలను వినియోగించుకొనటం.
  • రెగ్యులర్/సాధారణ విద్యార్దులలో CwSN విద్యార్దులను కలిపి వేయటం కోసం సమయస్కుల గుర్తింపు కార్యక్రం (peer group sensitization program) నిర్వహించటానికి యోచన.
  • CwSN విద్యార్దులకు వారి తల్లితండ్రులకు క్షేత్ర యాత్రలు నిర్వహించటం.
  • CwSN పిల్లలను బడుల్లో చేర్చటానికి వారిని అక్కడ నిలిపి ఉంచటానికి దడులు కట్టిన మరుగుదొడ్లను ఏర్పాటు చేసే యోచన భవిష్యత్తులో NRSTC లకూ  కంప్యూటర్ విద్యనందించే యోచన.

ప్రణాళికా విభాగం

ఎ. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆన్ ఎడ్యుకేషన్ (యుడిఎస్ఇ) కార్యక్రమం 2018-19 సంవత్సరానికి పూర్తయింది.

బి. వార్షిక పని ప్రణాళిక & బడ్జెట్ 2019-20 మే 2019 నెలలో ఎస్పీడి, ఎపి., అమరావతికి సిద్ధం చేసి సమర్పించారు

సి. ఆధార్ సీడింగ్ ఈ సంవత్సరంలో పూర్తయింది.

బడులకు మౌలిక నిర్మాణ వసతి సౌకర్యాలు

  • పాఠశాలలకు మౌలిక నిర్మాణ వసతి సౌకర్యాలు:
  • ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర శిక్ష ద్వారా 2018-19 సంవత్సరానికి గాను 164 అదనపు తరగతి గదులు, 75 పాఠశాలలకు ప్రహరి గోడలు, 101 పాఠశాలలకు భారీ మరమ్మత్తులు మరియు 16 పాఠశాలలకు రంగులు వేయుటకు రూ.27 లక్షలు మంజూరు కాగా, ఈ సంవత్సరము 2019-20 నకు గాను 5 తరగతి గదులు, 69 మరుగుదొడ్లు 82 భారీ మరమ్మత్తులు కొరకు రూ. 479.33 లక్షలు మంజూరు కాబదడినవి.
  • మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గారంటీ స్కీం (MGNREGS)

MGNREGS ద్వార 520 పాఠశాలలలో 1,07,448 నిడివిగల ప్రహరి గోడలను రూ. 4442.49 లక్షలతో మంజూరు కాబదినవి. ఇందు 517 ప్రహరి గోడలు నిర్మాణ దశలో ఉన్నవి.

  •  రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ (RMSA)

161 అదనపు గదులు ల్యాబ్, లైబ్రరీ, డ్రాయింగ్ & క్రాఫ్ట్ మరియు కంప్యూటర్ ల్యాబ్ కొరకు రూ.1631.92 లక్షలు మంజూరు కాబడి పురోగతి లో ఉన్నవి. 

  • కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయ (KGBV) జూనియర్ కాలేజీలు.

6 కే.జి.బి.వి.జూనియర్ కాలేజీలు ఆనందపురం, భీమిలి, పద్మనాభం, సబ్బవరం, నక్కపల్లి మరియు మునగపాక నందు ఒక్కింటికి రూ.110.00 లక్షలు తో మంజూరు కాబడి పురోగతిలో ఉన్నవి. అవి కాకుండా ఈ సంవత్సరం నకు గాను 5 కే.జి.బి.వి. జూనియర్ కాలేజీలు రోలుగుంట, గొలుగొండ, చోడవరం, రాంబిల్లి మరియు పాడేరు నందు ఒక్కింటికి రూ.160.00 లక్షలు  తో మంజూరు కాబడినవి.

  • ఏ.పి.ఆర్.ఈ.ఐ. (నాబార్డ్) APREI (NABARD):

ఏ.పి.ఆర్.ఈ.ఐ.(నాబార్డ్) ద్వార ఏ.పి.ఆర్.ఈ.ఐ. అత్చుతాపురం మరియు భీమిలి పాఠశాలల నందు అదనపు సౌకర్యాలు కలుగ జేయుటకు రూ.527.25 లక్షలతో  మంజూరు కాబడి, పురోగతిలో ఉన్నవి. 

  • ప్రభుత్వ జూనియర్ కాలేజీలు (ఆర్.ఐ.డి.ఎఫ్.XXIII): 4 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు(చోడవరం, చింతపల్లి, పాడేరు మరియు హుకుంపేట) లో అదనపు సౌకర్యాలు కలుగ జేయుటకు రూ.400.15 లక్షల తో మంజూరు కాబడినవి.పై వాటిలో 3 పనులు పురోగతిలో ఉండగా, ఒకటి టెండర్ దశలో ఉన్నది.

బాలికా శిశు వికాస కార్యక్రమం :

  • 06.2019 నుండి 11.06.2019 వరకు సి.ఆర్.టి. ల విద్యా విషయ సామర్ధ్యం పెంచటానికి ప్రత్యేక ప్రారంభ పరిచయ కార్యక్రమం నిర్వహించినారు.
  • మార్చి’2019 ఎస్.ఎస్.సి పరిక్షలకు హాజరు అయ్యే కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల విద్యార్ధులకు సైన్సు లెక్కలు ఇంగ్లీషు సబ్జెక్టులలో విషయ నిపుణులకు   ప్రత్యేక క్లాసులు నిర్వహించినారు.
  • 34 కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలలో పెరటి తోటలు ఏర్పాటు చేసి వాటి నిర్వహణ చేయుట, తద్వారా పౌష్టిక ఆహరం అందించే చర్యలు తీసుకోవడం.
  • ఏజెన్సీ ప్రాంతాలలో కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలలో సౌర విద్యుత్ ఉత్పత్తి యంత్రాలు అందించటం. రక్షణ కోసం అన్ని కె.జి.బి.విలలో సి.సి.కెమెరా లు ఏర్పాటు చేయడం జరిగినది.
  • కెరియర్ మార్గదర్షాల జీవన నైపుణ్యాలలో విద్యార్ధినులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించుటకు ప్రతిపాదించటం.
  • కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాల విద్యార్ధినులకు స్పోర్టు దుస్తులు అందించటం జరిగినది.
  • కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలలో స్కూలు వార్షికోత్సవం స్పోర్ట్స్ మీట్ నిర్వహణ.

పధకంపథకం వారీగా సాధించవలసినవి మరియు సాధించినవి 15.08.2017 వరకు:

BUDGET RELEASED & EXPENDITURE – 2019-2020
Sl.No Major Component Budget Approved Opening Balance Budget released by SPO Total (OB+SPO) Expenditure upto 31-07-19
I Elementary Education
1 Residential School/Hostels
Residential Schools 0.000 5.466
Residential Hostels 0.000 1.321
2 Strenghtening of Esisting Schools 35.000 35.000 34.559
3 Transport & Escort Facilities 0.000 0.000
4 Free Uniform 0.000 0.000
5 Free Textbooks 0.000 0.000
6 Special Training of out of School Children 79.970 79.970 1.901
7 Media & Community Mobilization 0.000 0.000
8 Funds for Quality (LEP, Innovation, Guidance etc) 0.000 0.000
 Quality Components (Elementary) 0.000 4.011
Project Innovation (Elementry) 0.000 0.000
 Learning Enhancement Programme (LEP)  (Elementary) 0.000 0.000
9 Training for In-Service Teacher, Head Teachers and Tacher Educators 0.000 0.000
In-Service Training (I to VIII Class) 0.000 6.563
70. Induction Training (Elementary) 0.000 0.000
 Training of Resource Persons  & Master Trainers (Elementary) 0.000 0.000
School Leadership Training of Head Teachers/ Principals/RPs (Elementary)  0.000 0.000
Training of Educational Administrators (Elementary) 0.000 0.000
10 Composite School Grant 845.630 845.630 0.000
11 Libraries 0.000 0.000
12 Rastriya Aavishkar Abhiyan 0.000 0.000
13 Support at Pre-Primary Level 0.000 0.000
14 Academic suport through BRCs/URCS/CRCs 0.000 0.000
Bolck Resource Centres(BRCs) 177.600 177.600 103.207
Cluster Resource Centres(CRs) 245.600 245.600 91.199
15 Sports & Physical Education 0.000 0.000
16 Teacher Salary (HMs/teacher) 244.000 244.000 56.833
17 Kasturba Gandhi Balika Vidyalayas (KGBVs) 733.630 733.630 126.819
18 Provision for Children with special needs(CWSN) 15.590 15.590 10.982
19 Monitoring Information System 0.000 0.000
20 Program Management 211.560 211.560 157.871
  Total Elementary 0.000 186.203 2588.580 2774.783 600.731

 d) సంప్రదించవలసిన సంఖ్యలు :

Sl No Name of the Mandal Designation Mobile No. Mail Id
1 Visakhapatnam Project Officer, 9849909126 dpepvis@yahoo.co.in
possavsp@gmail.com
1 Anakapalli MEO 8978877162 mrcanakapalli@gmail.com;
2 ANANDAPURAM MEO 9866901290 meoanandapuramvspdeo@gmail.com
3 ANANTHAGIRI MEO 9441577383 meoananthagirivspdeo@gmail.com
4 Arakuvalley MEO 9490027935 meoarakuvalleyvspdeo@gmail.com
5 ATCHUTAPURAM MEO 9603771521 meoatchuthapuramvspdeo@gmail.com
6 BHEEMUNIPATNAM MEO 9000253569 meobheemunipatnamvspdeo@gmail.com
7 BUTCHIYYAPETA MEO 8919293239 meobpt@gmail.com
8 CHEEDIKADA MEO 8985494112 meocdkvspdeo@gmail.com
9 CHINAGADILI MEO 9494187123 meochinagadili@gmail.com
10 CHINTAPALLI MEO 9440439662 meochintapallivspdeo2018@gmail.com
11 Chodavaram MEO 9985048072 cdmmeo@yahoo.co.in
12 Devarapalli MEO 9440133570 meodevarapallivspdeo@gamil.com
13 DUMBRIGUDA MEO 9490027935 meodumbrigudavspdeo@gmail.com
14 G.K.VEEDHI MEO 9440409428 meogkveedhivspdeo@gmail.com
15 G.madugula MEO 9440409428 meogmadugulavspdeo@gmail.com
16 Gajuwaka MEO 9494187123 meogajuwaka@gmail.com
17 GOLUGONDA MEO 7981202867 meogolugondavspdeo@gmail.com
18 Hukumpeta MEO 9493416039 meohukumpetavspdeo@gmail.com
19 K.KOTAPADU MEO 9949865793 meokkotapaduvspdeo@gmail.com
20 KASIMKOTA MEO 9490744168 meo_kasimkota@rediffmail.com;
meokasimkotavspdeo@gmail.com;
21 KOTAURATLA MEO 7981473067 meokotauratlavspdeo@gmail.com
22 Koyyuru MEO 9440439662 koyyurumeo@gmail.com
23 Makavarapalem MEO 9492589220 meomakavarapalemvspdeo@gmail.com
24 MUNAGAPAKA MEO 9493801750 meomunagapakavspdeo@gmail.com
25 MUNCHINGIPUT MEO 6302538628 meomput@gmail.com
26 NAKKAPALLI MEO 7981473067 meonkp@gmail.com
27 NARSIPATNAM MEO 9492589220 meonarsipatnamvspdeo@gmail.com
28 NATHAVARAM MEO 9550770151 meonathavaram@gmail.com
29 PADERU MEO 9491331764 paderumeo@gmail.com
30 PADMANABHAM MEO 9866901290 meopadmanabham@gmail.com
31 PARAVADA MEO 9494187123 meoparavada@gmail.com
32 PAYAKARAOPETA MEO 9110576199 meo.payakaraopeta@gmail.com
33 Pedabayalu MEO 9490731524 meopedabayaludeovsp@gmail.com
34 Pendurthi MEO 9494187123 meopendurthivspdeo@gmail.com
35 Pedagantyada MEO 9494187123 meopedagantyadavspdeo@gmail.com
36 Rambilli MEO 9291605300 meorambillivspdeo@gmail.com
37 RAVIKAMATHAM MEO 9502720429 meoravikamathamvspdeo@gmail.com
38 Rolugunta MEO 9949764864 meorolugunta@gmail.com
39 Sabbavaram MEO 9490950434 meosabbavaramvspdeo@gamil.com
40 S RAYAVARAM MEO 9885667413 meosrayavaramvspdeo@gmail.com
41 V.MADUGULA MEO 9959988473 meovmadugula@gmail.com
42 VISAKHAPATNAM URBAN MEO 7382070188 vspurbanmrc@gmail.com
43 Yellamanchili MEO 9985576856 meoylm@yahoo.in

 

e) ముఖ్యమైన లింకులు :

http://ssa.ap.gov.in/SSA/

http://www.badirunamthirchukundam.com

http://cse.ap.gov.in/MDM/

http://rmsaap.nic.in/

http://mhrd.ap.gov.in/MHRD/login.do

http://scert.ap.gov.in/SCERT/