Close

RBI Quiz

https://www.rbi90quiz.in/

ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌

ఆర్బీఐ ఆధ్వర్యంలో 19 నుంచి క్విజ్ పోటీలు

*సెప్టెంబర్ 17లోపు పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచన
*ఎల్డీఎంతో క‌లిసి పోస్ట‌ర్ల‌ను ఆవిష్క‌రించిన క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్

విశాఖ‌ప‌ట్ట‌ణం, సెప్టెంబ‌ర్ 02 ః రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 90 వసంతాల పూర్తి చేసుకున్న సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు ఈ నెల 19వ తేదీ నుంచి ఆన్లైన్ క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్లను సోమ‌వారం కలెక్టరేట్లో లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం. శ్రీ‌నివాస్, ఇత‌ర అధికారుల‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు కనీసం ఇద్దరు చొప్పున టీంగా ఏర్పడి సెప్టెంబర్ 17వ తేదీ లోగా https://www.rbi90quiz.in వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 19వ తేదీ నుంచి క్విజ్ పోటీలు జ‌రుగుతాయ‌ని వివ‌రించారు.

జాతీయ, జోనల్, రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులు ఉంటాయన్నారు. జాతీయ స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలచిన వారికి రూ.10 లక్షలు, రూ.8 లక్షలు, రూ.6 లక్షలు చొప్పున, జోనల్ స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి రూ.5 లక్షలు, రూ.4 లక్షలు, రూ.3 లక్షల చొప్పున నగదు బహుమతులు అంద‌జేస్తార‌ని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృ తీయ స్థానాల్లో నిలిచిన వారికి రూ.2 లక్షలు, రూ.1.5 లక్షలు, రూ.లక్ష చొప్పున బహుమతులు ఉంటాయని వెల్లడించారు. విద్యార్థుల్లో రిజర్వు బ్యాంక్, ఆర్థిక పర్యావరణ వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు ఈ క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎల్డీఎం తెలిపారు.

………………………………………..
జారీ, జిల్లా స‌మాచార పౌర సంబంధాల అధికారి, విశాఖ‌ప‌ట్ట‌ణం.